ఇంట్లో ఏ జంతువు పెంచుకుంటే..

inner-page-banner

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఇళ్లల్లో కుక్క, పిల్లి, పక్షులు, చేపలు..ఇలా రకరకాల పెంపుడు జంతువులను పక్షులను పెంచుకుంటున్నారు. ఎవరైనా తన ఇష్టాలను అనుకూలతలను బట్టి పెంపుడు జంతువులను పెంచుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే పెంపుడు జంతువులని తమ ప్రాణంగా భావిస్తారు. వాటిని రాత్రి సమయంలో సైతం పక్కనే ఉండేలా చూసుకుంటారు. మరికొందరు ఎలుకలు కుందేళ్లు కూడా ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. అయితే వాటి నుండి తీసుకోవాల్సిన రక్షణ మాత్రం తీసుకోవడం మరచిపోతారు. ఇక ఐశ్వర్యవంతులు అయితే.. ఖరీదైన బ్రీడ్ కి చెందిన వాటిని ఇంట్లో పెంచుకుంటారు. పెంపుడు జంతువులను పెంచడం వల్ల మానసిక ఉల్లాసం పెరగడం వాస్తవమే అయినప్పటికీ .. వాటి వల్ల పిల్లలకి అనారోగ్యం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెంపుడు జంతువులు పక్షుల విషయంలో ఎవరి మాట ఎలా ఉన్నా.. వీటి గురించి హిందూ పురాణాల్లో కొన్ని విషయాలు మనకి తెలియజేస్తున్నాయి.. ఏ జంతువుని పెంచుకుంటే మనకు మంచిదో.. ఏ జంతువుని మన ఇంట్లో పెంచుకోకూడదో..  ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.

పిల్లి.. పిల్లులు దృష్టశక్తులుకి, చేతబడి, చెడు కార్యక్రమాలకను లోనయ్యేలా చేయటం వంటి వాటికి నిలయంలా ఉంటాయి అని, ఇంట్లో నెగటివ్ ఎనర్జీతో పాటు దురదృష్టానికి కారణమవుతాయి. అంతే కాకుండా అవి మంత్రగత్తెలుగా మారుతాయి అని యూరప్ కి చెందిన కొన్ని వర్గాల వారు నమ్ముతారు. అందుకే అక్కడ వారు పిల్లిని ఇంట్లో పెంచుకోరు.

తాబేలు.. ఇంట్లో తాబేలుని పెంచుకుంటే అది ఎంతో మనకు అదృష్టాన్ని కలిగిస్తుంది. మనల్ని ధనవంతులు గా మారుస్తుంది. తాబేలు ఇంట్లో ఉంటే అదృష్టం మన వెంట ఉన్నట్టే.. మీ ఇంట్లో మీకై మీరే తాబేలుని పెంచడంలో తప్పులేదు. కానీ తాబేలు అదంతట అదే ఇంట్లోకి ప్రవేశిస్తే అపశకునం. ఇక ఆ ఇంటి యజమాని ఆ ఇంటిని ఖాళీ చేసి ఇంకో ఇంటికి వెళ్లడం ఉత్తమం. అలా కాదు అని అదే ఇంట్లో నివాసం ఉంటే కష్టాలు తప్పవు.

చేప.. చాలామంది తమ ఇంట్లోని అక్వేరియంలో చేపల్ని పెంచుతుంటారు. నిజానికి అలా ఇంట్లో చేపలు పెంచడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. అలా ఇంట్లో అక్వేరియంలో చేపల్ని పెంచితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది. మీ అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని పెంచటంలో చేప అద్భుతమైనది. చేపలు నీటిలో కదులుతూ ఇంట్లోకి శుభ శక్తులని ఆహ్వానిస్తాయి. ముఖ్యంగా ఇంట్లో అక్వేరియంలో గోల్డ్ ఫిష్ ఉంటే ఇంకా మంచిది.

కుక్క.. నిజానికి ఇంట్లో కుక్కలని పెంచుకోవడం చాలా మంచిది. కుక్కలు ఉన్న ఇంట్లో వాతావరణం చాలా పాజిటివ్ గా ఉంటుంది. అవి ఇంట్లో ఉండే వారికి అదృష్టాన్ని తెచ్చి పెడతాయి. అంతేకాదు పొరపాటున మీకు ఏదైనా అపాయం సంభవిస్తే.. ముందే పసిగట్టి మిమ్మల్ని రక్షిస్తాయి.  ఇక్కడ సైన్స్ కి కూడా అందని విషయం ఏమిటి అంటే.. మనిషి చనిపోయే ముందు ఫస్ట్ పసిగట్టి ఆ వ్యక్తి చనిపోకుండా ఆ యజమాని ప్రాణాలు కాపాడగలిగే శక్తి ఒక కుక్కకు మాత్రమే ఉంటుందట. అంత విశ్వాసం కలది  కుక్క.. ప్రస్తుత రోజుల్లో కుక్కలు లేని ఇల్లు చాలా తక్కువగా ఉంటాయి.

ఆవు.. ఆవు కనుక మీ ఇంట్లో ఉంటే దేవతలందరూ మీ ఇంట్లో ఉన్నట్లే.. అందుకే ఆవు ఇంట్లో ఉంటే చాలమంది  అదృష్టంగా భావిస్తారు. ఇంట్లో వీటిని పెంచుకుంటే, మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా పోయి.. పాజిటివ్ ఎనర్జీ సంతరించుకుంటుంది. హిందూ పురాణాల ప్రకారం..అవును పెంచుకోవడం అంటే ఇంట్లో సాక్షాత్ దేవతలందరినీ కొలువై ఉండేలా చేసుకున్నట్టే.  


You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు