మంగళసూత్రం లో ఎన్ని పూసలు వేసుకోవాలి ...

inner-page-banner

హిందూ సంప్రదాయంలో మంగళసూత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పెళ్లి సమయంలో పెళ్లికూతురు మెడలో పెళ్ళికొడుకు కట్టే ఈ మంగళసూత్రాన్ని చాలా ప్రత్యేకంగా నియమనిష్టలతో తయారు చేస్తారు. భర్త యొక్క  ఆయుస్సు మంగళసూత్రాలు లో ఉంటుంది అని.. మన హిందూ సాంప్రదాయం పాటించే ప్రతి ఒక్కరు నమ్ముతారు. అందుకే ఆ మంగళసూత్రాన్ని ఎంతో పవిత్రంగా ... జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే మంగళసూత్రంలో నల్లపూసలను, పగడాలను , ముత్యాలను చేర్చడం ఖచ్చితం అని మన శాస్త్రం లో ఉంది. అసలు మంగళసూత్రంలో ఎన్ని పూసలు ఉండాలి అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది.. అలాగే మంగళసూత్రం గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం...

ఏ స్త్రీ అయినా తను జీవితాంతం ముత్తయిదువు గా జీవించాలి అని.. తన భర్త నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటుంది. అందుకే మన భారతీయ స్త్రీ .. తన మెడలో నుండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మంగళసూత్రాన్ని తీయదు. ఒకవేళ ఆ మంగళసూత్రాన్ని మెడలో నుండి తీయాల్సి వస్తే  మంగళసూత్రం మెడలో నుండి తీయక ముందు పసుపు దారాన్ని మెడలో వేసుకుని ఆ తర్వాత మంగళసూత్రాన్ని తీస్తారు. మంగళసూత్రం తాడుని మంగళవారం, శుక్రవారం అసలు మార్చుకోకూడదు. ఒకవేళ తాడుని మార్చుకోవాలి అంటే.. బుధవారం గురువారం రోజుల్లో మార్చుకోవాలి. అలాగే , అష్టమి, అమావాస్య రోజు అష్టమి రోజు ఈ పనులు చేయరాదు. 

మంగళసూత్రంలో తొమ్మిది నల్లపూసలు వేసుకోవాలని.. మన శాస్త్రం చెప్తుంది. అన్ని పూసలని వేసుకోలేని వారు మూడు లేదా ఐదు పూసలు వేసుకోవచ్చు. ముఖ్యంగా మంగళసూత్రం తాడుతో  తొమ్మిది సంఖ్య అనేది ముఖ్యమని మన శాస్త్రం చెబుతుంది. మీరు మంగళసూత్రంలో ముత్యం ,పగడం, నల్లపూసలు కలిపి వేసుకోవాలి అనుకుంటే అన్ని కలిపి 9 వచ్చేలా చూసుకోండి. ముఖ్యంగా మంగళసూత్రాలు గుచ్చుకునే సమయంలో ఎవరితోనూ మాట్లాడరాదు... ఆ తాడు నీ మెడలో వేసుకుని వరకు మౌనం వహించాలి అని శాస్త్రం చెబుతోంది. మెడలో బంగారపు తాడు ఉన్నాసరే.. మంగళ సూత్రాలను, పూసలను పసుపు దారానికి కుచ్చి ... ఆ తాడు ని బంగారపు తాడుకి కట్టాలి అని మనకు శాస్త్రం చెబుతుంది. ఎందుకు అంటే వివాహ సమయంలో వరుడు, వధువు మెడలో పసుపు తాడు కట్టే సంప్రదాయం మనది. కాబట్టి మంగళసూత్రం ఖచ్చితంగా పసుపు దారానికి ఉండాల్సిందే !

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు