ఈ ఐదు రాశుల అబ్బాయిలకి పండగే పండగ .. చుట్టూ ఎప్పుడు అమ్మాయిలే !

inner-page-banner

జ్యోతిషశాస్త్రం ప్రకారం ప్రతి మనిషి కూడా.. కొన్ని ఘడియల్లో కొన్ని రాశులో జన్మించడం వల్ల ఆ రాశి ఫలాలు మరియు ఘడియల యొక్క విశిష్టతల వల్ల వారి జన్మలలో వారి జాతకాలు ఆధారపడి ఉంటాయి. అలా వారు జన్మించిన సమయం వల్ల .. వారి జాతకాలు అదృష్టాన్ని తెచ్చి పెడుతూ ఉంటుంది. అదేవిధంగా కొందరిలో వారి జాతకం ప్రకారం.. ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. అది కూడా కేవలం గ్రహాల మార్పుల కారణంగానే జరుగుతుంది. ఆకర్షణ శక్తి అనేది కేవలం కొన్ని రాశుల లోనే ఉంటుంది. కొన్ని రాశులలో జన్మించిన వారికి మాత్రమే.. ఇటువంటి ఆకర్షణ శక్తి ఉంటుంది. అయితే వీరిలో కొంతమందికి మాత్రం.. స్త్రీలని ఎక్కువగా ఆకర్షించే శక్తి ఉంటుంది. అదేవిధంగా ఒక్కొక్క రాశి యొక్క లక్షణాలకు.. ఒక్కొక్క గ్రహం యొక్క లక్షణాలకు సంబంధం ఉంటుంది. అదే విధంగా కొన్ని గ్రహాలు అయితే కొన్ని రాశుల్లో చాలా బాగా రాణిస్తూ ఉంటాయి. కానీ కొన్ని గ్రహాలకి , కొన్ని రాశులకు మాత్రం విరుద్ధ భావాలు ఉంటాయి. వాటిని నీచ రాశులు అని పిలుస్తారు. అయితే ఓ వ్యక్తి  జన్మించిన రాశి .. నక్షత్రం కారణంగానే వారి జన్మ యొక్క జాతకం ఆధారపడి ఉంటుంది అని పండితులు చెబుతుంటారు. వ్యక్తిత్వం.. మనస్తత్వం.. పెద్దలు చెప్తుంటారు. ఈ వ్యక్తి యొక్క లక్షణాలు స్వభావం.. భవిష్యత్తు.. ఇష్టాయిష్టాలు.. ప్రేమ.. నడవడిక.. ఆలోచనలు.. వృత్తి, ప్రవృత్తి.. ఆయుష్షు.. ఆరోగ్యం.. ఐశ్వర్యం, సంతోషం.. ఇలా అన్ని పరిస్థితులను జన్మ రాశి, నక్షత్రం , రాశి ఫలాలు నిర్ణయిస్తాయి. అందుకే వివాహ సమయంలో స్త్రీ పురుషుల యొక్క జన్మ నక్షత్రాలని బట్టి .. వివాహం జరిపించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు చూడబోయే ఐదు రాశులలో జన్మించిన అబ్బాయిలు మాత్రం.. తమ చుట్టూ ఉండే అమ్మాయిలని బాగా ఆకర్షిస్తారని.. మీలో ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది అని.. జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. మరి  ఆ ఐదు రాశులు ఏవో చూద్దాం....

Also Read: గణేష్ చతుర్థి .. ప్రాముఖ్యత, విశేషాలు, వినాయక చవితిని ఎలా జరుపుకుంటారో చూడండి !

మొదటిది మిధున రాశి.. మిధున రాశికి చెందిన పురుషులు ఈ విషయంలో చాలా అదృష్టవంతులు. వీరు అంతగా కష్టపడకుండానే స్త్రీలని ఆకట్టుకుంటారు. నిజానికి ఈ రాశి వారిది సున్నితమైన మనస్తత్వం. అమ్మాయిలు వీరిలో ఎక్కువగా, చాలా తక్కువ సమయంలోనే కలిసిపోతారు. వీరితో మాట్లాడటానికి ఆసక్తి చూపుతారు. ఆడవారి మనస్తత్వాన్ని గమనించి, వారికి నచ్చిన విధంగా నడుచుకోవడం లో ఈ రాశివారు ముందు వరుసలో ఉంటారు. అమ్మాయి హృదయాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం వీరిలో ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ రాశికి చెందిన వారికి అమ్మాయిలు ఎక్కువగా ఆకర్షితులవుతారు.

తర్వాత రాశి మకర రాశి.. మకర రాశికి చెందిన అబ్బాయిలు, చూడగానే ఆకట్టుకునే శరీరాకృతితో ఉంటారు.  ఈ కారణంగానే అమ్మాయిలు  త్వరగా వీరికి ఆకర్షితులవుతారు.  వీరు చెప్పే సమాధానం చాలా తెలివిగా ఉంటుంది. ప్రస్తుతం గురించి మాత్రమే వీరు ఎక్కువగా ఆలోచిస్తారు. భవిష్యత్తు గురించి వీరు అసలు ఆలోచన చేయరు. చాలా చురుగ్గా ఉండటం వల్ల.. ఇలాంటివారితో స్నేహం చేయడానికి అమ్మాయిలు ఎక్కువగా ముందుకు వస్తూ ఉంటారు

Also Read: బ్రహ్మంగారి కాలజ్ఞానం పార్ట్ 7 ..

తర్వాత  రాశి సింహ రాశి..ఈ సింహ రాశికి చెందిన వారు, బలమైన శాశ్వత సంబంధాలని  కోరుకుంటారు. తాత్కాలిక సంబంధాలకి చాలా దూరంగా ఉంటారు.ఈ  సింహ రాశి వారి లో.. శాశ్వత సంబంధాల పట్ల ఒక మంచి అవగాహన కలిగి.. బంధాలకు ఎక్కువ విలువ ఇస్తూ ఉంటారు. అలాగే వీరికి విశాలమైన హృదయం కలిగి ఉంటుంది. కానీ అమ్మాయిల తో మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఈ రాశి వారిలో కొందరు మాత్రం చాలా సున్నిత మనస్కులు ఉంటారు. రాశి వారిని ఒక అమ్మాయిలు మాత్రమే కాకుండా అందరూ కూడా ఎంతో ఇష్టపడతారు. దానికి కారణం ఈ రాశివారు అందరితో ప్రేమగా మెలగడమే.

తర్వాత రాశి వృశ్చిక రాశి.. ఈ రాశికి చెందిన వారికి కళాప్రపూర్ణ బిరుదు ఇవ్వచ్చు. అందుకే వీరిని ఎక్కువగా అమ్మాయిలు ఇష్టపడుతుంటారు. అసలు నిజంగా ఈ వృశ్చిక రాశి వారికి .. రానీ తెలియని పని అంటూ ఏమీ ఉండదు... ఎందుకు అంటే ఈ రాశి వారు మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ అని చెప్పవచ్చు. తమ అనుకున్న వారి కోసం అయితే.. ఎంతటి కష్టాన్ని అయినా పడతారు. అనుకున్నది సాధించే వరకు మాత్రం వదిలి పెట్టరు. అందంగా ఉండటమే కాకుండా భవిష్యత్తుపై ఒక అవగాహన కూడా ఉంటుంది.


తరువాత రాశి తులా రాశి.. తులా రాశి వారి ఆకర్షణ ముఖ్యంగా కళ్ళల్లోనే ఎక్కువగా ఉంటుంది. తక్కువ సమయంలోనే అమ్మాయిలని ఇట్టే కళ్లతోనే ఆకర్షిస్తారు. వీరి వ్యవహార శైలి నడవడిక ఇతరులతో మాట్లాడే తీరు.. అన్నీ కూడా ఇతరుల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. దీంతో వెంటనే అమ్మాయిలు వీరి వైపు ఆకర్షితులవుతారు. ప్రేమ విషయంలో మాత్రం మీరు దీర్ఘంగా ఆలోచిస్తారు. ఈ రాశికి చెందిన వారు ఏ దానినైనా ఒక్కసారి నాది అనుకుంటే.. వదిలిపెట్టే తత్వం వీరిలో అసలు ఉండదు. ఈ రాశివారు ప్రేమ, బాధ్యతల మధ్య సమతుల్యత పాటిస్తూ ఉంటారు. అదేవిధంగా వీరు ఎప్పుడూ కూడా ప్రేమ విషయంలో తప్పు చేయరు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటే.. ఒకటికి పది సార్లు ఆలోచించి ముందుకు అడుగులు వేస్తారు.‌ ఈ రాశివారికి తమ మాట మీద మొండితనం ఎక్కువగా ఉంటుంది.


You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు