స్వీట్ పొంగల్ ఈజీ గా

inner-page-banner

కావలసిన పదార్దాలు : 

1 కప్ బియ్యం
1/2 కప్ పెసరపప్పు
ప్రధాన వంటకానికి
1 కప్ తురిమిన టెంకాయ
5 టీ స్పూన్ నెయ్యి
1 కప్ బెల్లం పొడి
అవసరాన్ని బట్టి యాలకులు
అవసరాన్ని బట్టి జీడిపప్పు
అవసరాన్ని బట్టి నీళ్ళు

తయారీ విధానం : 

ముందుగా బియ్యం, పెసరపప్పుని శుభ్రంగా కడిగి కుక్కర్‌లో పెట్టి 4 విజిల్స్ వచ్చేవరకూ ఉడికించాలి.ఇప్పుడు కుక్కర్ ఆవిరి పోయే వరకూ ఉంచి.. ఉడికిన అన్నం మిశ్రమాన్ని గరిటెతో మెత్తగా చిదమాలి. ఇందులోనే కొద్ది కొబ్బరి పొడి వేసి బాగా కలపాలి.ఇప్పుడు పాన్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. ఇప్పుడు అందులో కొన్ని జీడిపప్పులు వేసి వేయించి ఓ గిన్నెలోకి పక్కనతీయాలి.ఇప్పుడు అదే పాన్‌లో బెల్లం, నీరు వేయాలి. అందులోనే యాలకులు వేయండి. బెల్లం కరిగేలా వేడి చేయండి. బెల్లం పూర్తిగా కరిగాక అందులో యాలకులను వేయాలి.బెల్లం మిశ్రమం మరుగుతున్నప్పుడు బియ్యం మిశ్రమాన్ని అందులో వేసి ఉండలు కట్టకుండా బాగా కడపాలి.ఇప్పుడు పొంగల్ మిశ్రమాన్ని కొద్దిగా ఉడికిన తర్వాత అందులో నెయ్యి వేయాలి. ఇలా తయారైన పొంగల్‌ని ఓ బౌల్‌లోకి తీసుకుని జీడిపప్పులతో గార్నిష్ చేయాలి. ఇది వేడి వేడిగా తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది.


You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు