స్పాంజ్‌ కేక్‌ తయారీ విధానం

inner-page-banner


కావలసిన పదార్థాలు: 
కోడిగుడ్లు - నాలుగు, 
పిండి - ముప్పావు కప్పు, 
పంచదార పొడి - ముప్పావు కప్పు, 
వెనీలా ఎసెన్స్‌ - అర టీస్పూన్‌, 
బేకింగ్‌ పౌడర్‌ - అర టీస్పూన్‌,
బట్టర్‌ పేపర్‌.
 
తయారీ విధానం: 

బట్టర్‌ పేపర్‌ను టిన్‌ సైజుకు తగినట్టుగా రెండు ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. తరువాత టిన్‌ అడుగు భాగాన బట్టర్‌ పేపర్‌ను పరచాలి. ఒక పాత్రలో కోడిగుడ్లు పగలగొట్టి అందులో పంచదార, వెనీలా, ఉప్పు, బేకింగ్‌ పౌడర్‌ వేసి బాగా కలియబెట్టాలి. ఇప్పుడు మరొక పాత్రలో పిండి తీసుకోవాలి. కోడిగుడ్ల మిశ్రమాన్ని పిండిపై పోయాలి. నెమ్మదిగా స్పూన్‌తో కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని టిన్‌లో తీసుకుని ఓవెన్‌లో బేక్‌ చేయాలి. చల్లారిన తరువాత కేక్‌ సర్వ్‌ చేసుకోవాలి.

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు