అలనాటి హీరోయిన్ పూర్ణిమ ఇప్పుడు ఎక్కడ ఉంది , ఏంచేస్తుందో తెలుసా !

inner-page-banner


చిరంజీవి హీరోగా వచ్చిన "ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య" అనే సినిమాలో చిట్టి తల్లి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన పూర్ణిమ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పూర్ణిమ తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ భాషలలో కూడా నటించి ప్రేక్షకులను బాగానే అలరించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అసలు ఈమె సినిమాల్లోకి ఎలా వచ్చింది. ప్రస్తుతం ఎక్కడ ఉందొ ..ఏం చేస్తుందో ఇప్పుడు చూద్దాం..


Also Read: నితిన్ తండ్రి ఎవరో తెలుసా .. అయన ఎంత పెద్ద డిస్ట్రిబ్యూటరో తెలిస్తే షాక్ అవుతారు !

పూర్ణిమ వాళ్ళది చెన్నైలో స్థిరపడ్డ తెలుగు కుటుంబం. పూర్ణిమకు చిన్నప్పటి నుంచి గాయని కావాలని కోరికగా ఉండేది. హరిశ్చంద్రుడు సినిమాలో పాట కోసం వెళ్ళి అనుకోకుండా అందులో చిన్న వేషం వేసింది. ఆ సినిమాలో మహానటి సావిత్రి కూతురుగా నటించింది. అయితే , పూర్ణిమ తండ్రికి మాత్రం ఆమె సినిమాల్లో నటించడానికి ఒప్పుకోలేదు. సినిమాలో అంటే అసభ్యత ఎక్కువగా ఉంటుంది అని భయపడ్డారు. కానీ జంధ్యాల తదితరులు తమ సినిమాల్లో అసభ్యతకు తావుండదని ధైర్యం చెప్పి ఆమెను ముద్దమందారం సినిమా కోసం ఒప్పించారు. ఆలా జంధ్యాల దర్శకత్వంలో 1981 లో వచ్చిన ముద్ద మందారం సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 1981 నుంచి 1988 మధ్యలో తెలుగు, తమిళ, కన్నడ సినిమాలతో కలిపి సుమారు 50 సినిమాల్లో నటించి , అప్పటి స్టార్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇచ్చింది. ఇక పూర్ణిమ 21 సంవత్సరాల వయసులో వివాహం చేసుకుంది. పెళ్ళైన తరువాత ఆమె కుటుంబం కొద్ది రోజులు చెన్నైలో తరువాత కొద్దిరోజులు విశాఖపట్నంలో ఉన్నారు. ప్రస్తుతం గుజరాత్ లో ఉంటున్నారు. పూర్ణిమ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. ప్రేమ గురించి మాట్లాడుతూ సినిమాల్లో బిజీగా ఉండుట వలన ప్రేమించటానికి సమయం దొరకలేదని, అలాగే ప్రేమ మీద పెద్దగా నమ్మకం లేదని చెప్పింది. పెళ్లి అయ్యాక సినిమాలకు విరామం ఇచ్చింది. ప్రస్తుతం తన భర్త, పిల్లలతో సంతోషంగా గడుపుతున్నానని చెప్పుకొచ్చింది. ఇక,  పూర్ణిమ తెలుగు తమిళ, కన్నడ, మలయాళ తదితర భాషలలో మొత్తం దాదాపు 100 చిత్రాలలో పైగా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించింది.

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube