అభిషేకం సీరియల్ వసుమతి రియల్ లైఫ్ స్టోరీ.. ఈమె ఎన్ని సినిమాల్లో నటించిందో తెలుసా..

inner-page-banner


తెలుగు ప్రముఖ ఛానల్ అయిన ఈ టీవీలో ప్రసారం అవుతూ .. మంచి ప్రేక్షకాదరణ పొందుతోన్న సీరియల్ అభిషేకం.ఈ సీరియల్లో నెగిటివ్ రోల్ లో నటిస్తున్న వసుమతి తన నటనతో, అందంతో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇప్పుడు ఈ వీడియోలో వసుమతి రియల్ లైఫ్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలను తెలుసుకుందాం..

Also Read: వంటలక్క అభిమానులకు శుభవార్త..తెలుగు బుల్లితెరపై తొలిసారి !

ఇక విషయంలోకి వెళితే.. వసుమతి అసలు పేరు మాధవి. మిర్చి సినిమాలో ఈమె నటించడం వల్ల మాధవికి మిర్చి మాధవి అనే పేరు వచ్చింది. ఈమె గుంటూరులో పుట్టి పెరిగింది. తండ్రి ఓ బ్యాంకు ఉద్యోగి. మాధవికి పెళ్లయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. మాధవి భర్త కూడా బ్యాంకు ఉద్యోగిగా పని చేస్తున్నారు. మాధవి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వక ముందు .. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ గా పని చేశారు. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే .. మాధవి సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ గా పనిచేస్తున్న సమయంలో ఇన్స్టిట్యూట్ లో యానివర్సరీ సెలబ్రేషన్స్ కి   కొరియోగ్రాఫర్ ని పిలిచారు. అతడు ఇండస్ట్రీకి సంబంధించిన వాడు కావడంతో మాధవి ని చూసి .. మీరు సినిమాల్లోకి వస్తారా అని అడిగాడు. అలా అనుకోకుండా మాధవి బుల్లితెర ఇండస్ట్రీకి పరిచయం అయింది. జీ తెలుగు లో ప్రసారమైన త్రిశూలం సీరియల్ ద్వారా మొదటిసారిగా బుల్లి తెరపై కనిపించింది. ఆ తర్వాత చిన్నారి అనే సీరియల్లో మాధవి నటించింది. అలా పలు సీరియల్స్ లో నటించింది.

Also Read: బిగ్ బాస్ లోకి ఆ జబర్దస్త్ స్టార్ కమెడియన్ ..

ఇక మాధవి నటించిన సినిమాల విషయానికి వస్తే.. మిర్చి.. 100% లవ్.. శతమానం భవతి.. లక్ష్మీస్ ఎన్టీఆర్.. మహా నాయకుడు.. గద్దెల కొండ గణేష్.. ఇలా పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం అభిషేకం సీరియల్లో వసుమతి గా నటిస్తూ తెలుగు బుల్లితెర ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంటుంది. యాక్టింగ్ ఏ కాదు మాధవి పాటలు కూడా చాలా బాగా పడుతుంది. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ గా జాబ్ చేస్తూనే.. మాధవి సినిమాల్లోనూ సీరియల్స్ లోనూ నటిస్తోంది.

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube