అత్యధిక పారితోషికం తీసుకునే జాబితా విడుదల .. ఆరో స్థానంలో అక్షయ్ కుమార్

inner-page-banner

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పారితోషికం అందుకుంటున్న టాప్-10 నటుల జాబితాను ఈ ఏడాదికి గాను ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసింది
 ఇందులో హాలీవుడ్‌ నటుడు డ్వేన్‌ జాన్సన్‌ మొదటి స్థానం సంపాదించాడు. ఆ తరువాత ర్యాన్‌ రేనాల్డ్స్, మార్క్‌ వాల్బెర్గ్, విన్‌ డీజిల్‌ ఇంకా ప్రముఖ సినీతారల పేర్లు జాబితాలో ఉన్నాయి. అయితే ఈ జాబితాలో బాలీవుడ్‌కి చెందిన నటుడు అక్షయ్‌ కుమార్‌ స్థానం సంపాదించాడు. అత్యధిక పారితోషికం తీసుకునే జాబితాలో అక్షయ్‌ కుమార్‌ ఆరో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో భారత్ నుంచి ఒక్క అక్షయ్ కుమార్‌కు మాత్రమే చోటు దక్కడం విశేషం. గతేడాది నాలుగో స్థానంలో ఉన్న అక్షయ్.. ఈసారి రెండు స్థానాలు దిగజారాడు. 48.5 మిలియన్ డాలర్ల ఆదాయంతో ఆరో స్థానంలో నిలిచాడు. అక్షయ్ కుమార్ సినిమాల ద్వారా కంటే ప్రకటనల ద్వారానే ఎక్కువ ఆర్జిస్తున్నట్టు ఫోర్బ్స్ పేర్కొంది. అమెజాన్ ప్రైమ్ సిరీస్ ‘ది ఎండ్ షో’లో నటిస్తున్న అక్షయ్ 10 మిలియన్ డాలర్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపింది.


Also Read: బిగ్‌బాస్‌ రన్నరప్‌పై దుండగుల దాడి..

రాక్‌స్టార్‌ డ్వేన్‌ జాన్సన్‌ నటించిన ‘రెడ్‌ నోటీస్‌’ చిత్రానికి నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా 23.5 మిలియన్‌ డాలర్లు అందుకున్నారు. ఇప్పుడు వరుసగా రెండోసారి 87.5 మిలియన్లతో మొదటి స్థానంలో నిలిచాడు. నటుడు ర్యాన్‌ రేనాల్డ్స్‌ 71.5 మిలియన్‌ డాలర్లు సంపాదించి రెండో స్థానంలో నిలిచాడు. మార్క్‌ వాల్బెర్గ్‌ 58.3 మిలియన్‌ డాలర్లతో 3వ స్థానం. బెన్‌ అప్లెక్‌ 55 మిలియన్‌ డాలర్ల సంపాదనతో 4 స్థానం, ఇక యాక్షన్‌ హీరో విన్‌ డీసిల్‌ 54 మిలియన్లతో 5వ స్థానం పొందాడు. ఇక ఆరో స్థానంలో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ 48.5 మిలియన్‌ డాలర్ల సంపాదనతో అగ్రభాగాన నిలిచాడు. ఫోర్బ్స్‌ జావితాలో చోటు దక్కించుకున్న ఏకైక బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌. టెలివిజన్‌ సీరీస్‌లో ది ఎండ్‌ చిత్రంలో నటించాడు. అమెజాన్‌ ప్రైమ్‌ నుంచి కూడా డబ్బు సంపాదించాడు. ఇక కొన్ని వాణిజ్య ఎండార్స్‌మెంట్‌ ఒప్పందాల ద్వారా, మల్టీవిటమిన్, టాయిలట్‌ క్లీనర్లకు ప్రచారకర్తగా ఎంతో సంపాదించాడు. లిన్‌-మాన్యువల్‌ మిరాండా 45.5 మిలియన్లతో 7 స్థానం. అలాద్దీన్‌ నటుడు విల్‌స్మిత్‌ 45.5 మిలియన్‌ డాలర్ల సంపాదనతో 8వ స్థానంలో నిలిచాడు. 9వ స్థానానికి గాను ఆడమ్‌ శాండ్లర్‌ 41 మిలియన్లు సంపాదించాడు. పదో స్థానంలో జాకీచాన్‌ 40 మిలియన్ల సంసాదనతో ముందున్నారు. ప్రస్తుతం వీరి ఆదాయాలను జూన్‌ 1, 2019 సంవత్సరం నుంచి ఈ ఏడాది జూన్‌ 1, 2020 వరకు భవిష్యత్తులో చేయబోయో ప్రాజెక్టులను సైతం పరిగణలోకి తీసుకొని లెక్కించారు.

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube