శాసనమండలి చైర్మన్ షరీఫ్ పాజిటివ్.. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం

inner-page-banner

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి అంతకంతకు విజృంభిస్తుంటే ఉంది. ప్రతి రోజు కూడా దాదాపుగా పది వేలకు పైగా పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. సామాన్యుల నుండి.. రాజకీయ ప్రముఖులు.. ప్రజా ప్రతినిధులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. 

ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు.. మంత్రులు.. మాజీ మంత్రులు.. ఎంపీలు కరోనా బారిన పడగా.. తాజాగా శాసనమండలి చైర్మన్ కరోనా బారిన పడ్డారు. ఏపీ శాసనమండలి చైర్మన్‌ షరీఫ్‌కు కరోనా సోకింది. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆయన్ను హైదరాబాద్ ‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. షరీఫ్‌ త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్సీలు, తెదేపా నేతలు ఆకాంక్షించారు

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube