బిగ్‌బాస్‌ రన్నరప్‌పై దుండగుల దాడి..

inner-page-banner


హిందీ ‘బిగ్‌బాస్‌ సీజన్‌-13’ రన్నరప్‌, మోడల్‌ ఆసిమ్‌ రియాజ్‌ గాయాలపాలయ్యారు. బుధవారం రాత్రి వీధుల్లో సైక్లింగ్‌ చేస్తున్న సమయంలో కొంతమంది తెలియని వ్యక్తులు అతనిపై దాడి చేశారు. ఈ విషయాన్ని ఆసిమ్‌ తన ట్విట్టర్లో వీడియో రూపంలో తెలియజేశారు. దుండగుల దాడిలో తన భుజం, మోకాలు, చేతులకు గాయాలయ్యనట్లు ఆసిమ్‌ వెల్లడించారు. అయితే ప్రస్తుతం తను క్షేమంగా ఉన్నానని ఆసిమ్‌ వెల్లడించారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో ఆసిమ్‌ అభిమానులు అతడిపై జరిగిన దాడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసిమ్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు. #GetWellSoonAsim అనే హ్యష్‌ట్యాగ్‌ ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube