అదిరిపోయిన బిగ్ బాస్ సీజన్ 4 లోగో ... 15 మంది పార్టిసిపెంట్స్ వీరే !

inner-page-banner

బిగ్ బాస్ ..బిగెస్ట్ రియాలిటీ షో ఇన్ ద వరల్డ్. కానీ, ప్రస్తుతం ప్రపంచం నలుమూలలా వ్యాపించింది. తెలుగులో మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ బిగెస్ట్ రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ నాలుగో సీజన్ లోకి అడుగు పెట్టబోతోంది. కరోనా మహమ్మారి  రాకుండా ఉండివుంటే.. ఇప్పటికే ‘బిగ్‌బాస్-4’జరుగుతూ ఉండేది. అయితే కరోనా మహమ్మారి విజృంభణతో ఈ రియాలిటీ షోక్ కు బ్రేక్ వేసింది. ఇక , ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘బిగ్‌బాస్’ సీజన్ 4పై అధికారికంగా ప్రోమోను విడుదల చేసింది. ఈ సీజన్‌కు సంబంధించిన లోగోను విడుదల చేస్తూ.. స్టార్ మా  ప్రోమోను విడుదల చేశారు. ప్రోమో లాస్ట్‌ లో అతిత్వరలో అంటూ తెలిపారు. ఈ సీజన్ 4 బిగ్ బాస్ లోగో చాలా ఇంట్రెస్టింగా ఉంది.

ఇక ఈ ఏడాది అక్టోబర్, నవంబర్, డిసెంబర్..ఈ  మూడు నెలల్లో అంటే 100 రోజులపాటు బిగ్ బాస్  సీజన్ 4 ను నిర్వహించేందుకు బిగ్ బాస్ టీం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ షోలోకి వెళ్లే వారికి కరోనా టెస్టులు చేసి వారికి నెగిటివ్ అని తేలిన తర్వాతే బిగ్ బాస్ హౌస్ లోకి పంపించేందుకు పార్టిస్పెంట్స్ ని సెలెక్ట్ చేస్తున్నట్లుగా సమాచారం. అసలు ఈ సారి హోస్ట్  ఎవరు .. ఎవరెవరు హౌస్ లో వెళ్ళబోతున్నారు  అనే విషయానికి వస్తే.. ముందుగా ఈ బిగ్ బాస్ సీజన్ 4 కి కూడా హోస్ట్ గా  మళ్లీ కింగ్ నాగార్జున గారే ఉంటారు అని తెలుస్తుంది. నాగార్జునకి కొన్ని వారాలు వీలుకాని పక్షంలో ఆయన స్థానంలో హీరో రానా  హోస్టుగా వస్తారు అని సమాచారం. దీన్నిబట్టి చూస్తే ఈసారి బిగ్ బాస్ సీజన్ ఫోర్  ఇద్దరు హోస్ట్ చేయబోతున్నారు. గత సీజన్లో రమ్యకృష్ణ 2 ఎపిసోడ్స్ కి హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. దీన్ని బట్టి చూస్తే హోస్ట్ గా నాగార్జున ని దాదాపు ఫిక్స్ చేసింది బిగ్ బాస్ టీం.
ఇక సీజన్ 4 పార్టిసిపెంట్స్ విషయానికొస్తే.. 15 మందితో ఈ సీజన్ ప్రారంభించబోతున్నారు. 15 మందిలో 12 మంది సెలబ్రిటీలు కాగా.. ముగ్గురు కామన్ మ్యాన్స్ ..అంటే  కొద్దిగా పేరున్న సెలబ్రిటీలు ఉండబోతున్నారు. ఇందులో ఈసారి RJ , రేడియో జాకీ లని కూడా పార్టిస్పెంట్స్ గా తీసుకో పోతున్నారని సమాచారం. కామన్ మ్యాన్స్  ముగ్గురు ఎవరన్నది కాసేపు పక్కన పెడితే మిగిలిన 12 మంది సెలబ్రిటీస్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. ఈ పన్నెండు మంది సెలబ్రిటీల లిస్టులో ముఖ్యంగా హీరో తరుణ్, యాంకర్ వర్షిని పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరి పేర్లు దాదాపు బిగ్ బాస్ టీమ్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక కమెడియన్ వైవా హర్ష.. సింగర్ పర్ణిక.. మల్లికార్జున.. సునీత లు ఉన్నట్లుగా తెలుస్తుంది.. అయితే సింగర్ సునీత ఇంకా ఫిక్స్ అవ్వలేదని సమాచారం. అలాగే జబర్దస్త్ టీం లీడర్ గా కొనసాగుతున్న రాకేష్... క్యారెక్టర్ ఆర్టిస్ట్ అపూర్వ... తాగుబోతు రమేష్ ల పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి.  ఈసారి  బిగ్బాస్ సీజన్  కి మరింత గ్లామర్ జోడిస్తూ హీరోయిన్ శ్రీ రాపాక.. శ్రద్దాదాస్.. ఈషా రెబ్బా లను కూడా తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. వీరితో పాటు హీరో నందు.. యాంకర్ మంగ్లీ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. వీరిలో ఎవరి పేర్లు కన్ఫామ్ అవుతాయో.. వారితో పాటుగా ముగ్గురు కామెంట్స్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు. 

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube