మాజీ ఎంపీ నంది ఎల్లయ్య క‌న్నుమూత‌

inner-page-bannerకాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. కొద్దిరోజుల క్రితం కరోనా సోకడంతో ఆయ‌న ను  నిమ్స్‌కు త‌ర‌లించారు కుటుంబ స‌భ్యులు. అయితే చికిత్స అనంత‌రం ఇటీవ‌ల చేసిన టెస్టులో ఆయ‌న‌కు కరోనా నెగిటివ్ అని అని నిర్దార‌ణ అయ్యింది. కాక‌పోతే క‌రోనా వ‌ల్ల ఆయ‌న రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బాగా దెబ్బతింది. కాగా ఈ రోజు ఉదయం 10 గంటలకు నిమ్స్ లో క్రానికల్ వ్యాధితో నంది ఎల్లయ్య మరణించినట్లు కుటుంబ సబ్యులు తెలిపారు. దీంతో రాంనాగర్‌లోని ఆయన నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి.You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube