కరోనా పోరుకి మరో రూ . 1000 కోట్లు : సీఎం జగన్

inner-page-banner

ఏపీలో రోజురోజుకి కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో  మెరుగైన వైద్య అందించాలనే లక్ష్యం తో ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల చికిత్స కోసం అదనంగా మరో 54 ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ తెలిపారు. దీనికోసం మొత్తంగా 138 ఆస్పత్రుల్లో క్రిటికల్‌ కేర్‌సదుపాయాలు కల్పిస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్ర స్థాయిలో అదనంగా మరో 5 ఆస్పత్రుల్లో క్రిటికల్‌ కేర్‌ సదుపాయలు కల్పించే దిశగా సాగుతున్నామని వెల్లడించారు.

అందులో ఇప్పటికే 3 ఆస్పత్రులు అందుబాటులోకి వచ్చాయని సీఎం జగన్  తెలిపారు. క్రిటికల్‌ కేర్‌ చికిత్సకు అదనంగా 2380 బెడ్లు అందుబాటులోకి వస్తాయన్న సీఎం జగన్... వచ్చే 6 నెలల్లో అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు.ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, పారామెడికల్‌సిబ్బంది, వైద్యుల నియామకం, ఆరోగ్య సిబ్బంది నియామకాల కోసం ఖర్చు చేస్తామని వివరించారు.  క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన కోవిడ్‌ సమీక్షా సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఈ మేరకు వెల్లడించారు.

కాగా, తాజాగా  గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 8147 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 80858కి పెరిగింది. ఏపీలో నిన్న  7798 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు ఆ రికార్డు కూడా బ్రేక్ చేసి కొత్తగా మరో 8147 కేసులు నమోదయ్యాయి.గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 49 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 933కి చేరింది.

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు