సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో సిబిఐ దర్యాప్తు

inner-page-banner

బాలీవుడ్‌ యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణను కేంద్ర దర్యాప్తు బృందం ( సీబీఐ)కి అప్పగించాలని బీహార్‌ ప్రభుత్వం సిఫారసు చేసింది. సుశాంత్‌ ఆత్మహత్య కేసులో బీహార్, మహారాష్ట్ర పోలీసులు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. కాగా, దర్యాప్తులో భాగంగా గత ఆదివారం రాత్రి ముంబైకి వెళ్లిన బీహార్ ఐపీఎస్ ఆఫీస‌ర్ విన‌య్ తివారీని బలవంతంగా క్వారంటైన్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో సోమవారం బీహార్‌ అసెంబ్లీలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలూ ఈ కేసులో సీబీఐ విచారణ కోసం డిమాండ్ చేశారు.



సుశాంత్‌ది ఆత్మహత్య కాదని... తన కొడుకు మృతి వెనుక కుట్ర కోణాలు దాగి ఉన్నాయని ఇప్పటికే సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ కూడా తమ కుమారుడి ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలని బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ను కోరారు. కుటుంబ‌స‌భ్యులు కోరిన నేప‌థ్యంలో సుశాంత్ మృతి కేసులో సీబీఐ విచార‌ణకు సిఫార‌సు ప్ర‌తిపాద‌న చేస్తున్న‌ట్లు ఓ మీడియాతో సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. కాగా, సుశాంత్ మృతి కేసులో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీహార్ ప్రభుత్వం సీబీఐ విచారణకు సిఫారసు చేయడం చర్చనీయాంశంగా మారింది.

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube