మూడు రాజధానులపై మాకు సంబంధం లేదు .. కేంద్రం క్లారిటీ

inner-page-bannerఏపీలో మూడు రాజధానుల విషయంలో నానా రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ వైసీపీ మూడు రాజధానులని తెరపైకి తీసుకువచ్చింది. 3 రాజధానుల అంశం బయటకి వచ్చినప్పటి నుండి దీనిపై అనేకమైన అభిప్రాయాలు వెలుగులోకి వచ్చాయి. జనవరి 20న రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. శాసనమండలిలో ఈ బిల్లులు పాస్ కాలేదు. దీంతో, జూన్ 16న రెండోసారి ఈ రెండు బిల్లులకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. అనంతరం, ఈ బిల్లులను శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపింది.  ఈ బిల్లులపై న్యాయశాఖ అధికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాత తాజాగా గవర్నర్ ఆమోదముద్ర వేశారు.  దీనితో ఏపీ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, జ్యుడీషియల్‌ రాజధానిగా కర్నూలు  ఏర్పడబోతున్నాయి. అయితే మూడు రాజధానులని వ్యతిరేకిస్తూ .. టీడీపీ అధినేత చంద్రబాబు రోజుకొక ప్రెస్ మీట్ తో ప్రజల ముందుకు వస్తున్నారు. అలాగే గరవ్నర్ ఆమోదం తెలిపిన తరువాత కూడా దీనిపై స్టే ఇవ్వాలని కొందరు హైకోర్టు ను ఆశ్రయించడం తో హైకోర్టు దీనిపై స్టే ఇచ్చింది.  ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని అంశంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని దాఖలైన అఫిడవిట్‌ కు కేంద్ర ప్రభుత్వం గురువారం కౌంటర్ అఫిడవిట్ ధాఖలు చేసింది. ఏపీలో ఒకే రాజధాని ఉండాలా? లేదా మూడు రాజధానుల ఉండాలనే చర్చ వాడివాడీగా జరుగుతోంది. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం రాజధానిపై ఏపీ హైకోర్టుకు ఇచ్చిన వివరణ ఆసక్తిని రేపుతోంది. 
రాజధానుల విషయంలో కేంద్రానికి నిర్ణయాధికారం లేదని స్పష్టం చేసే ఆఫిడవిట్ ను గురువారం హైకోర్టులో దాఖలు చేసింది. చట్టసబల్లో సభ్యుల మధ్య జరుగాల్సిన చర్చ న్యాయ సమీక్ష పరిధిలోకి రాదని పేర్కొంది. ఈమేరకు కేంద్రం హోంశాఖ రాష్ట్రాల రాజధానిపై నిర్ణయం తీసుకోవడం కేంద్రం పరిధిలోనిదా రాష్ట్రం పరిధిలోనిదా అనే అంశంపై దాఖలైన పిటిషన్ పై తాజాగా కేంద్రం హోంశాఖ అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో రాజధానుల విషయంలో తమ జోక్యం ఉండబోదని కేంద్రం స్పష్టం చేసినట్లయింది.  పునఃవిభజన చట్టంలోని సెక్షన్ 6 అవర్ ప్రకారం రాజధానిని ఎంపిక చేసేందుకు శివరామకృష్ణన్ కమిటీని నియమించామని కేంద్రం చెప్పింది. 2015 ఏప్రిల్ 23న ఏపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయించిందని, అప్పుడు కూడా కేంద్రానికి ఎటువంటి పాత్ర లేదని తెలిపింది. ప్రస్తుత ఏపీ ప్రభుత్వం 3 రాజధానుల నిర్ణయానికి జూలై 31న గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందని, ఇందులో కూడా కేంద్రానికి ఎటువంటి పాత్ర లేదని స్పష్టం చేసింది. పునఃవిభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరువేరుస్తామని, స్పెషల్ కేటగిరీ కింద ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్‌లో పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే మూడు రాజధానులు ఏర్పడకుండా ఆపడం ఎవరితరం కాదు అని .. నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read : రాజధాని వికేంద్రీకరణ బిల్లుకి గవర్నర్ ఆమోదం

కేంద్రం క్లారిటీ తో టీడీపీ లో , అధినేత చంద్రబాబు లో గుబులు మొదలైంది అని చెప్పవచ్చు. ఇప్పటివరకు కోర్టులు , కేంద్రం అంటూ అమరావతి ప్రజల తరపున పోరాడుతున్నాం అని ఉదరగొడుతున్న చంద్రబాబు నెక్స్ట్ ప్లాన్ ఏమిటో మరి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ కేశినేని సొంత పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా నేతలకు చురకలంటించారు. ‘మన కలలు మనమే సాకారం చేసుకోవాలి.. మన కలలు ఎదుటి వారు సాకారం చేయాలని కోరుకోవడం అవివేకం అవుతుందన్నారు. అమరావతి, చంద్రబాబు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కన్న కల.. అది సాకారం అవ్వాలంటే 2024లో టీడీపీ అధికారంలోకి రావాలి.. ఆ దిశగా పార్టీలో అందరూ పాటుపడాలి.. మీడియా సమావేశాల వల్ల పేపర్ స్టేట్మెంట్స్ వల్ల ప్రయోజనం లేదు’అంటూ ట్వీట్ చేశారు. నాని సొంత పార్టీ నేతలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.. టీడీపీలో చర్చ నడుస్తోంది. కేశినేని నాని గతంలో కూడా సొంత పార్టీ నేతలు, అధిష్టానంపై విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకున్నారు. ఆ తర్వాత అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు.. నానినితో రెండు మూడు సార్లు సమావేశమై చర్చించి బుజ్జగించారు. ఏదేమైనా మూడు రాజధానుల విషయంలో టీడీపీ ఏమిచేయలేదు అని పార్టీ నేతలందరికీ బాగా అర్థమైంది. ఇక చంద్రబాబు కి ఆ  విషయం అర్థమైతే .. దీన్ని పక్కన పెట్టి పార్టీ నిర్మాణం పై ఫోకస్ పెడితే మళ్లీ అధికారంలోకి  వచ్చే అవకాశం కొంతలో కొంతైనా ఉంటుంది. మరి చంద్రబాబు గారు ఇకనైనా మేల్కొంటారో లేదో .. 

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube