గవర్నర్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ..!

inner-page-banner

ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్‌తో రాజ్ భవన్ లో ఈరోజు భేటీ అయ్యారు.గవర్నర్ బాబాయ్ కన్యాకుమారి ఎంపీ వసంత్‌కుమార్‌ మృతిపై సీఎం కేసీఆర్ రాజ్ భవన్ కు వచ్చి సంతాపం తెలిపారు. ఈ సంధర్భంగా తమిళిసై తన ట్విట్టర్ ఖాతాలో ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.


ముఖ్యమంత్రి వెంట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్‌కుమార్‌, మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, రైతు బంధు సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఉన్నారు.కాగా కరోనా వైరస్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వసంత్‌కుమార్‌ శుక్రవారం రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే.ఆయన అంత్యక్రియలు ఆదివారం ఉదయం కన్యాకుమారి జిల్లా అగస్తీశ్వరంలో జరిగాయి.


You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube