సీఎంకి కరోనా పాజిటివ్ ..ఆందోళనలో ప్రజలు

inner-page-banner

కరోనా వైరస్‌ దేశంలో తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి ప్రముఖులు , ప్రజాప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరిపై ఈ వైరస్  ప్రభావం చూపుతోంది. ఇ‍ప్పటికే పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వైరస్‌బారినపడగా.. తాజాగా మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత శివరాజ్‌సింగ్‌ చౌహన్‌కు కరోనా సోకింది. గత రెండు రోజులుగా తీవ్ర దగ్గు, జలుబుతో బాధపడుతున్న సీఎంకు శనివారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే ఆయన హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. సీఎంకు పాజిటివ్‌గా తేలడంతో ఆయనతో సమీపంగా మెలిగిన వారంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వైద్యుల సూచనల మేరకు ఆయన్ని కలిసిన అధికారులు, మంత్రులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కాగా దేశంలో కరోనా బారినపడిన తొలి సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ కావడం గమనార్హం.

వైద్యుల సూచనల మేరకు ఆయన్ని కలిసిన అధికారులు, మంత్రులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కాగా దేశంలో కరోనా బారినపడిన తొలి సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ కావడం గమనార్హం.

కరోనా లక్షణాలు కన్పించడంతో టెస్టులు చేయించుకున్నా.. రిపోర్టులో కరోనా పాజిటివ్‌గా తేలింది. నాతో ఇటీవల కార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొన్న వారంతా కరోనా పరీక్షలు చేయించుకోండి. ఇది నా విన్నపం. అంతేకాదు తనతో ఇటీవల కలిసిన వారంతం హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోండి అంటూ ట్విట్టర్‌ వేదికగా విజ్ఞప్తి చేశారు. కరోనా సమీక్ష సమావేశాలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరవుతానన్నారు. మధ్యప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా కరోనా సోకుతుందని శివరాజ్ సింగ్  చెప్పారు. తాను కరోనా వైరస్‌ సోకకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నానని, అయితే, చాలా మంది పలు విషయాలపై తనను కలిసేందుకు వచ్చారని, దీంతో కరోనా సోకి ఉండొచ్చని తెలిపారు.కాగా,  శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కరోనా రిపోర్టులు నిన్న మధ్యాహ్నం వచ్చాయి. ఆయనను వైద్య సిబ్బంది భోపాల్‌ లోని చిరాయు ఆసుపత్రికి తరలించనున్నట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ మిశ్రా తెలిపారు

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు