రూ. 75 కోట్ల కారు కొన్న క్రిస్టియానో రొనాల్డో ..ప్రపంచంలో అలాంటి కార్లు 10 మాత్రమే ..

inner-page-banner


క్రిస్టియానో రొనాల్డో ..ప్రపంచంలో ఈ పేరు తెలియనివారు ఉండకపోవచ్చు. ఈయన పోర్చుగల్ జాతీయ ఫుట్‌బాలర్, జువెంటస్ స్టార్. ఈయనకి జెట్ స్పీడ్‌తో దూసుకెళ్లే కార్లంటే చాలా ఇష్టం. ఇప్పటికే పలు టాప్ స్పోర్ట్స్ కార్స్ ను తన గ్యారేజ్ లో పెట్టుకున్న  రొనాల్డో తాజాగా బుగాటి లా వాచ్యూర్ ఎన్వైర్ కారుని కొనుగోలు చేశాడు. ఇటీవల 36వ సిరీస్ ఎ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ని జువెంటస్ క్లబ్ గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించిన రొనాల్డ్.. అదే జోరులో కళ్లు చెదిరే ధరని వెచ్చించి మరీ ఈ ఎన్వైర్ కారుని కొనుగోలు చేశాడు.  ఫ్రాన్స్‌కు చెందిన ప్రఖ్యాత ఆటోమొబైల్‌ సంస్థ బుగాటి తయారు చేసిన ప్రపంచంలోని అత్యంత ఖరీ దైన కారు ఇది. మార్కెట్‌లో ఈ ఎన్వైర్ కారు ధర రూ. 75 కోట్లు కాగా.. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 10 కార్లని మాత్రమే ఆ కంపెనీ తయారు చేస్తోంది. ఈ విషయాన్ని రొనాల్డో తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా లో కొత్త కారుతో తాను దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. వాస్తవానికి రొనాల్డో కార్ల గ్యారేజీలో టాప్ మోస్ట్ కంపెనీల కార్లు అన్నీ ఉన్నాయి. మార్కెట్‌లో వాటి విలువ సుమారు రూ. 264 కోట్లని అంచనా. అయినప్పటికీ.. తరచూ ఖరీదైన కార్లని రొనాల్డో కొనుగోలు చేస్తూ ఉంటాడు. ఎన్వైర్ కారు ప్రత్యేకత ఏంటంటే..? కేవలం 2.4 సెకన్లలోనే 0-62 MPH వేగాన్ని అందుకోనుండగా.. గరిష్టంగా గంటకి 380 కి.మీ వేగంతో దూసుకెళ్లనుంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ కారుని రొనాల్డో తన స్పోర్ట్స్ టీమ్ కలర్స్.. బ్లాక్ అండ్ వైట్ ‌లో‌లో కొనుగోలు చేశాడు. 35 ఏళ్ల క్రిస్టియానో మొత్తం రూ. 788 కోట్లతో ఈ ఏడాది అత్యధిక ఆర్జన కలిగిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇటీవలే అతడు రూ. 53 కోట్లతో అత్యంత అధునాతన విహార నౌకను కూడా కొనుగోలు చేశాడు.

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube