.హ్యుందాయ్‌ షోరూంలో జాబ్ కొట్టేసిన కుక్క .. !

inner-page-banner

కుక్క ..విశ్వాసానికి ప్రతిరూపం. ప్రస్తుత రోజుల్లో కుక్కలేని ఇల్లు అంటే చాలా తక్కువగా ఉంటాయి. బయట పనులతో తీవ్రమైన ఒత్తిడితో ఇంటికీ వచ్చి ఆ కుక్కతో కాసేపు ఆడుకుంటే మనసు తేలికపడుతుంది. పని స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది. అలాగే కుక్కకి ఉన్న విశ్వాసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్క పూట నువ్వు దానికి కడుపునిండా అన్నం పెడితే అది నీకు ప్రాణం పోయే వరకు విశ్వాసంగా జీవిస్తుంది. మనుషులు డబ్బుని బట్టి మారిపోతారు కానీ , కుక్క బుద్ది మారదు. అది తన యజమాని కోసం ప్రణాలివ్వడానికి ... అవసరమైతే తీయడానికి కూడా వెనుకాడడు. అందుకే అంటారు కుక్కకి ఉన్న విశ్వాసం నీకు లేకపాయ కదరా అని.ఇక అసలు విషయంలోకి వస్తే .. ప్రతి కుక్కకి ఒకరోజు అంటూ వస్తుంది అని చెప్పడం మన రొటీన్ డైలాగ్. కానీ , ఓ కుక్కని నిజంగానే ఒక రోజు అంటూ వచ్చింది. ప్రతిరోజూ ఓ కారు షోరూం ముందు తిరిగే కుక్క అందులోని ఉద్యోగుల మనసు దోచుకుంది. శునకం అందరితో స్నేహంగా ఉండడాన్ని గమనించిన షోరూం యజమాని దాన్ని దత్తత తీసుకొని ఏకంగా సేల్స్‌మెన్‌ ఉద్యోగం ఇచ్చేశాడు. ఆ వీధికుక్కకు టక్సన్‌ప్రైమ్‌ అని నామకరణం చేసి ఐడీ కార్డు తయారుచేయించారు. ఇప్పుడది కారు షోరూం ముందు సేల్స్‌మెన్‌ హోదాలో మెడలో ఐడీ వేసుకొని ఉద్యోగం చేస్తోంది.  షోరూం వచ్చేవారంతా దీన్ని చూస్తూ ఆశ్చర్యపోతున్నారు. ఈ కుక్క ఫొటోను ఇన్‌స్టాగ్రాంలో పెట్టారు. దీంతో ఇది ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.   

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube