అస్తమించిన దాదా !

inner-page-banner

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) ఇక లేరు. కరోనాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సోమవారం సాయంత్రం ఆయన కన్నుమూశారు. ఆర్మీ ఆర్ఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆగస్టు తొలి వారంలో ప్రణబ్ ముఖర్జీకి ఆర్మీ ఆర్‌ఆర్ డాక్టర్లు క్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత కరోనా కూడా కూడా నిర్ధారణ కావడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది.అవయవాలేవీ పనిచేయకపోవడంతో కోమాలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ప్రణబ్ ముఖర్జీకి చికిత్స అందిస్తున్నప్పటికీ ఫలితం లేకుండాపోయింది. దాదాను బతికించేందుకు డాక్టర్లు అహర్నిశలు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ కాపాడలేకపోయారు. తన తండ్రి చనిపోయారన్న వార్తను బరువెక్కిన హృదయంతో వెల్లడిస్తున్నట్లు ప్రణబ్ కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్వీట్ చేశారు.

Also Read: కోరిక తీర్చాలంటూ మహిళ చేయి పట్టుకున్న గ్రామ వాలంటీర్ ..అరెస్ట్ !

ప్రణబ్ ముఖర్జీ 1935, డిసెంబరు 11న పశ్చిమ బెంగాల్‌లోని మిరితిలో జన్మించారు. 2012, జులై 25 నుంచి 2017, జులై 25 వరకు భారత రాష్ట్రపతిగా సేవలందించారు. 1969లో ఇందిరా గాంధీ హయంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. 1973లో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రక్షణ మంత్రిగా, విదేశీ వ్యవహారాల మంత్రిగా, ఆర్థిక మంత్రిగానూ సేవలందించారు. 2012లో యూఏపీ మద్దతుతో రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచి పీ.ఏ. సంగ్మాను ఓడించారు. 70శాతం ఎలక్ట్రోరల్ ఓట్లు సాధించి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రాష్ట్రపతి పదవీకాలం పూర్తయ్యాక రాజకీయాలకు దూరంగా ఉన్నారు ప్రణబ్ ముఖర్జీ. రాజకీయాల్లోకి రాకముందు తపాలాశాఖలో యూడీసీగా పనిచేశారు. పొలిటికల్ సైన్స్ లెక్చరర్‌గానూ సేవలు అందించారు .

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube