ఐపీఎల్ లో అమ్ముడుపోని ఆ నలుగురు స్టార్ విధ్వంసకర ఆటగాళ్లు వీరే

inner-page-banner


ఐపీఎల్ అంటేనే క్రికెట్ వర్గాల్లో ఏదో తెలియని ఉత్సాహం. ఏ క్రికెటర్ ఎంత ధరకు అమ్ముడుపోతాడు అనేది ఒక మిస్టరీ అని చెప్పవచ్చు.. అప్పటివరకు కనీసం వారి పేర్లు కూడా తెలియని ఎంతో మంది అనామక క్రికెటర్లు కోట్లు పలికిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే అమ్ముడుపోని స్టార్ ఆటగాళ్లు ఉండటం అనేది చాలా అరుదు. అలా ఐపీఎల్ లో కొన్ని సందర్భాల్లో.. అమ్ముడుపోని కొంతమంది స్టార్ ఆటగాళ్ల వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం...

ఈ జాబితాలో మొదటి ఆటగాడు.. బంగ్లాదేశ్ ఆల్రౌండర్ shakib al hasan .. ఆశ్చర్యకరంగా షకీబ్ ను ఐపీఎల్ ప్రారంభ సీజన్లలో .. ఏ టీం మేనేజ్మెంట్ కూడా అతనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు. ఎప్పుడైతే కేకేఆర్ కొనుగోలు చేసిందో ఆ తర్వాత షకీభ్ విలువ ఏంటో ప్రపంచానికి తెలిసివచ్చింది. రెండుసార్లు కేకేఆర్ జట్టును ఛాంపియన్స్ గా నిలబెట్టడంలో shakib al hasan కీలక పాత్ర వహించారు.

ఇక ఈ జాబితాలో తర్వాతి ఆటగాడు.. కరేబియన్ విధ్వంసకర ఆటగాడు.. క్రిస్ గేల్... ఐపీఎల్ అంటేనే గేల్.. అలాంటిది గేల్ అమ్ముడు కాలేదా అని అనుకుంటున్నారా.. 2011 సీజన్ కి జరిగిన వేలంలో గేల్ అమ్ముడుపోలేదు. ఇంకో ఆటగాడు ఆ సీజన్ కి గాయం కారణంగా దూరమవడంతో .. విదేశీ ఆటగాళ్ల జాబితాలో క్రిస్ గేల్ ను ఆర్సిబి తీసుకుంది. అలా ఆర్ సి బి లోకి ఎంట్రీ ఇచ్చిన గేల్ .. ఆకాశమే హద్దుగా చెలరేగి ఐపీఎల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు.


Also Read: ధోని ప్రాక్టిస్ షురూ .. హెలికాప్టర్ షాట్ల కోసం ఫ్యాన్స్ ఎదురుచూపు !


ఇక 3వ ఆటగాడు andrew russell.. ఈ స్టార్ విధ్వంసకర ఆటగాడు కూడా 2011 సీజన్లో అమ్ముడుపోలేదు. వాస్తవానికి రస్సెల్ ఇప్పుడు అమ్ముడు పోక పోతే పెద్ద ఆశ్చర్యమే కానీ.. అప్పుడు అమ్ముడు కాకపోవడం పెద్ద విశేషమేమీ కాదు. ఎందుకు అంటే రస్సెల్ ఇంత విధ్వంసకర ఆటగాడు అని అప్పుడు ఎవరూ ఊహించలేదు. 2012లో ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన పెద్దగా ఆడే అవకాశం రాలేదు. అయితే 2014లో కోల్కతా జట్టు కొనుగోలు చేసిన తర్వాత రసేల్ దశ దిశ పూర్తిగా మారిపోయింది.. అప్పటినుండి విధ్వంసకర బ్యాటింగ్.. బౌలింగ్ తో ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

Also Read: ఐపీఎల్ 2020 : ఆ మూడు జట్లకి షాక్ ఇచ్చిన బోర్డు .. ఆ ముగ్గురు ప్లేయర్స్ అవుట్ !

ఇక నాలుగవ ఆటగాడు ఆస్ట్రేలియా ఓపెనర్ అరోన్ పించ్ .. కొత్త బంతిని, ఏమాత్రం కనికరం లేకుండా తన బ్యాట్ తో గ్రౌండ్ దాటించడం లో సిద్ధహస్తుడు. ఆస్ట్రేలియన్ డాషింగ్ ఓపెనర్ .. 2013 ఐపిఎల్ వేలంలో అమ్ముడు పోలేదు. అదృష్టవశాత్తు పించ్ తర్వాత సీజన్లో పూణే వారియర్స్ జట్టు లో చేరారు. ఇక ఆ తర్వాత ఐపీఎల్ లోపింఛ్ వెను తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. తాజా సీజన్లో అరోణ్ పించ్ ఆర్సిబి కి ఆడబోతున్నాడు. ఈ నలుగురు క్రికెటర్లు ఆయా సీజన్లలో అమ్ముడు పోకపోవడంతో ఆశ్చర్యమే అనిపించినా.. ఆ తర్వాత రోజుల్లో తమ సత్తా ఏంటో ప్రపంచానికి చూపించారు.

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube