భారీగా పతనమైన బంగారం ధర .. జూన్ తరువాత ఇప్పుడే అంత తక్కువ ..

inner-page-banner

బంగారం ధర గత కొద్దిరోజులుగా పదిపోటువస్తుంది.  పసిడి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పవచ్చు. శ్రావణమాసం ప్రారంభం నుండి భారీగా పెరిగిన బంగారం ధర  ... ఈ వారం రోజుల్లో భారీగానే తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బలహీనమైన ట్రెండ్ ఇందుకు కారణం. పసిడి ధర బాటలోనే వెండి కూడా నడిచింది.హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర వారంలో భారీగా తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.2930 పడిపోయింది. రూ.58,690 స్థాయి నుంచి రూ.55,760కు దిగొచ్చింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పడిపోయింది. 10 గ్రాములకు రూ.2,690 దిగి వచ్చింది. రూ.51,110కు పడిపోయింది.బంగారం ధర వెలవెలబోతే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర కూడా వారం రోజుల్లో భారీగా దిగి వచ్చింది . వెండి ధర కేజీకి ఏకంగా రూ.7250 పతనమైంది. రూ.66,950కు దిగొచ్చింది. వెండి నాణేలు, పరిశ్రమ యూనిట్ల నుంచి డిమాండ్ పడిపోవడమే దీనికి ప్రధాన కారణం.  


Also Read: ఒకేసారి వేలల్లో తగ్గిన బంగారం ధర.. ఎంతో తెలిస్తే షాకవుతారు , కొనడానికి ఇదే మంచి సమయం

ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్‌ లో కూడా బంగారం ధర పడిపోయింది. బంగారం ధర ఔన్స్‌కు భారీగా దిగొచ్చింది. 2,000 డాలర్ల పైకి చేరిన పసిడి ధర మళ్లీ కిందకు వచ్చేసింది. 1953 డాలర్ల వద్ద స్థిరపడింది. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 26 డాలర్లకు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో వారంలో 4 శాతానికి పైగా పడిపోయి ఔన్స్ 1950 డాలర్ల సమీపంలో ఉంది. రష్యా వ్యాక్సీన్ రాక నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ధరలు భారీగా తగ్గాయి. న్యూయార్క్‌లో స్పాట్ గోల్డ్ 0.4 శాతం 1945 డాలర్లు పలికింది. వారంలో ధరలు 4.5 శాతం పడిపోవడం గమనార్హం. జూన్ నుండి ఇంత దారుణంగా పడిపోవడం ఇదే మొదటిసారి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, ప్రపంచ దిగ్గజ ఆర్థిక వ్యవస్థలు తిరిగి కోలుకుంటున్న సూచనలు, అమెరికా డాలర్ కోలుకోవడం, రష్యా వ్యాక్సీన్, ఈక్విటీ మార్కెట్లు రోజురోజూ లాభాల్లోకి రావడం వంటి వివిధ కారణాలు పసిడి ధరలపై ప్రభావం చూపాయి.  ఏదేమైనా ఇది బంగారం కొనుగోలు చేయాలనే వారికీ శుభవార్త అని చెప్పవచ్చు. 

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube