బంగారం ప్రియులకి శుభవార్త : భారీగా పడిపోతున్న బంగారం .. త్వరలోనే రూ.30 వేలకు ..!

inner-page-banner

బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్ దెబ్బతో అంతర్జాతీయంగా మార్కెట్లన్నీ కుదేలు అవుతున్న నేపథ్యంలో సేఫ్ ఇన్వెస్ట్ మెంట్ గా బంగారం అవతరించింది. దీంతో మదుపరులు బంగారం వైపు తమ పెట్టుబడులను మరల్చారు. ఈ నేపథ్యంలో బంగారం ధరలు కొత్త రికార్డులను తాకాయి. బంగారంలో పెట్టుబడి పెట్టిన మదుపరులు లాభాలను ఆర్జించారు.ఇదిలా ఉంటే తాజాగా రష్యాలో కోవిడ్ 19 వ్యాక్సిన్ కు అక్కడ ప్రభుత్వం ఓకే చెప్పడంతో పాటు, ఇతర వ్యాక్సిన్ లు కూడా త్వరలోనే మార్కెట్లోకి వస్తున్నాయనే వార్తలతో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి.  ఆగష్టు నెలలో 10 గ్రాముల బంగారం ధర రూ.56వేలు దాటిపోయింది. అయితే, అక్కడి నుంచి క్రమంగా బంగారం ధరలు డౌన్ ఫాల్ అవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 10 గ్రాముల బంగారం ధర రూ.53 వేలుగా ఉన్నది. ఈ ధరలు రాబోయే రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. కరోనా సమయంలో ఆర్ధిక వ్యవస్థలు దెబ్బతినడంతో బంగారం ధరలు పెరిగాయి. ఇప్పుడు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ క్రమంగా కుదుటపడుతుంది. డాలర్ తో రూపాయి విలువ ప్రస్తుతం స్థిరంగా ఉన్నది. కరోనా వాక్సిన్ పై ఆశాజనకమైన రిపోర్టులు అందుతున్న నేపథ్యంలో కరోనా వాక్సిన్ రిలీజ్ తరువాత ఆర్ధిక వ్యవస్థలు వేగంగా కోలుకునే అవకాశం ఉన్నది. ఆ తరువాత బంగారం ధరలు మరింత తగ్గి 10 గ్రాముల బంగారం ధర రూ. 30వేలు లోపే ఉండే అవకాశం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు.

Also Read: బంగారం ప్రియులకు శుభవార్త ..భారీగా తగ్గిన బంగారం ధర .. !

బంగారం ధర భారీగా పతనమైంది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర.. నేడు కూడా దిగొచ్చింది. వరుసగా క్షీణిస్తున్న బంగారం ధర చూసి గోల్డ్ లవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ. 390 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 53,660 కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల ధర రూ. 290 తగ్గడంతో రూ. 49,190 కు చేరుకుంది. కాగా, బంగారం ధర తగ్గుతుంటే.. వెండి ధర మంత్రం పైకి కదిలింది. కేజీ వెండి ధర రూ. 50 పెరిగింది. దీంతో ధర రూ. 65,550 కు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం రూ. 490 మేర తగ్గడంతో రూ.54,380 చేరుకుంది. అలాగే రూ.410 తగ్గుదలతో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,850 కి దిగొచ్చింది. ఇకపోతే బంగారం ధర ఔన్స్‌ కు 1957 డాలర్లకు పడిపోయింది. వెండి ధర ఔన్స్‌ కు 27.39 డాలర్లకు చేరింది.

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube