ఒకేసారి వేలల్లో తగ్గిన బంగారం ధర.. ఎంతో తెలిస్తే షాకవుతారు , కొనడానికి ఇదే మంచి సమయం

inner-page-banner


లాక్ డౌన్ సమయంలో  సరికొత్త రికార్డులు సృష్టిస్తూ తనకి తానే పోటీ అంటూ  దూసుకెళ్తున్న పసిడి పరుగులకి బ్రేకులు పడ్డాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర ఈరోజు భారీగా దిగొచ్చింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగే అంశమని చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగినా కూడా దేశీ మార్కెట్‌లో పసిడి పడిపోవడం గమనార్హం. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పడిపోయింది. శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.3350 క్షీణించింది. దీంతో ధర రూ.55,500కు పడిపోయింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.3010 క్షీణతతో రూ.51,110కు దిగొచ్చింది.

Also Read: బంగారం ధరల్లో భారీ తగ్గుదల .. మూడు రోజుల్లో 4 వేలు తగ్గుదల .. ఇదే కారణం , ఇంకా తగ్గే అవకాశం !

కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ను తయారు చేసినట్లు నాలుగు రోజుల క్రితం రష్యా ప్రకటించిన అనంతరం ఇన్వెస్టర్లు బంగారంలో లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో పసిడిపై ప్రభావం పడి, తగ్గుముఖం పట్టింది. మరికొద్ది రోజులు బంగారం ధరలు ఒడిదుడుకులతో సాగి ఆపై నిలకడగా పెరిగే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనాతో పాటు ఆర్థిక అనిశ్చితి, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం బంగారంపై ప్రభావం చూపాయి. ఈ ఏడాది 30 శాతానికి పైగా ధరలు పెరిగాయి.

Also Read: హ్యుందాయ్‌ షోరూంలో జాబ్ కొట్టేసిన కుక్క .. !

 గత నాలుగు రోజుల్లో బంగారం రూ.4000కు పైగా తగ్గింది.  అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ పసిడి 1865 వద్ద బలమైన మద్దతు ఉందని, 1980 డాలర్ల వద్ద ప్రతిఘటన ఎదుర్కొంటుందని మరికొందరు కమోడిటీ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.15 శాతం తగ్గుదలతో 26.05 డాలర్లకు దిగొచ్చింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube