బంగారం ప్రియులకు శుభవార్త ..భారీగా తగ్గిన బంగారం ధర .. !

inner-page-banner

మొన్నటి వరకు సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తున్న పసిడి పరుగుకు బ్రేకులు పడ్డాయి. భారీగా పెరిగిన  బంగారం ధరలు  క్రమంగా  తగ్గుతున్నాయి.  అంతర్జాతీయంగా ధరలు తగ్గడంతో పాటుగా దేశీయంగా డిమాండ్ కొంతమేర తగ్గడంతో ధరలు దిగివస్తున్నాయి.  బంగారం ధర తగ్గడం వరుసగా రెండో రోజు కూడా క్షీణించింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగినా కూడా దేశీ మార్కెట్‌లో పసిడి పడిపోవడం గమనార్హం. వెండి సైతం బంగారం బాలోనే పయనించింది. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర దిగొచ్చింది. శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.780 పడిపోయింది. దీంతో ధర రూ.55,460కు క్షీణించింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా దిగొచ్చింది. 10 గ్రాముల బంగారం ధర రూ.720 తగ్గుదలతో రూ.50,840కు క్షీణించింది. పసిడి ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1100 పడిపోయింది. దీంతో ధర రూ.67,000కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

Also Read: ఒకేసారి వేలల్లో తగ్గిన బంగారం ధర.. ఎంతో తెలిస్తే షాకవుతారు , కొనడానికి ఇదే మంచి సమయం

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పరుగులు పెట్టింది. పసిడి ధర ఔన్స్‌కు 0.65 శాతం పెరుగుదలతో 1959 డాలర్ల వద్ద కదలాడుతోంది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 1.43 శాతం పెరుగుదలతో 27.53 డాలర్లకు చేరింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube