దేశవ్యాప్తంగా నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు .. తెలుగు రాష్ట్రాలకి హై అలర్ట్

inner-page-banner

దేశంలోని పలు ప్రాంతాల్లో రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పలు చోట్ల పిడగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో అనూహ్య వరదలకు ఆస్కారం ఉందని తెలిపింది. రాయలసీమ, దక్షిణ కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో నేటి  నుంచి మూడు, నాలులు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఒడిశాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం, బుధవారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.


Also Read: అన్ లాక్ 4.0... కేంద్రం విటికి గ్రీన్ సిగ్నల్ ?

పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశా, బిహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, అసోం, మేఘాలయా, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లో నేడు, రేపు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సిబ్బందిని, ప్రజలను అప్రమత్తం చేశాయి. నైరుతి రుతు పవనాల ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు రాష్ట్రాల్లో నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.

Also Read: ప్రణబ్ గురించి అతి తక్కువమందికి మాత్రమే తెలిసిన నిజాలు..

గోవా, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ తోపాటు పలు రాష్ట్రాల్లో నాలుగురోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని శాస్త్రవేత్తలు చెప్పారు. పశ్చిమ మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. తెలంగాణ, అసోం, మేఘాలయ, ఛత్తీస్ ఘడ్, పశ్చిమబెంగాల్, విదర్బ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లలో భారీ వర్షాలు కురుస్తాయి. యూపీ, రాజస్థాన్, అసోం, మేఘాలయ, కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో మంగళవారం  ఉరుములు,మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురువవచ్చని అధికారులు చెప్పారు. 


అరేబియా సముద్రంలో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని గుజరాత్, గోవా, ఒడిశా, పశ్చిమబెంగాల్ సముద్ర తీరప్రాంతాల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. ఇక గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రలో ఘాట్ ప్రాంతాలు, ఈస్ట్ రాజస్థాన్, సెంట్రల్ ఇండియాలోని పలు ప్రాంతాల్లో 4-5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చు. ఇక ఉత్తరాఖండ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, తూర్పు రాజస్థాన్, యూపీలో రాగల 24 గంటల్లో పిడుగులు పడే ప్రమాదముందని వాతావరణ విభాగం హెచ్చరించింది.

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube