నిఖిల్ కుక్కతో పోల్చింది ఎవరిని ...ఆనందంలో పవన్ ఫ్యాన్స్ !

inner-page-banner

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ  తాజాగా  పవర్ స్టార్ అనే సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఓడిపోయిన తరువాతి కథ అంటూ ఈ సినిమాని తెరకెక్కించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని పోలిన ప్రవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో చూపించాడు వర్మ. ఇప్పటికే ఫస్ట్ లుక్  , గడ్డి తింటావా అనే సాంగ్ రిలీజ్ చేసాడు వర్మ.  తాజాగా దీనికి సంబందించిన ట్రైలర్‌ను విడుదల చేశాడు. అయితే టైటిల్ లోగోలో గ్లాస్ పిక్‌ను ఉంచి పవన్ కళ్యాణ్‌ను గుర్తకు తెచ్చేలా ఉండే ఓ వ్యక్తితో ప్రధాన పాత్ర చేయించడంతో ఈ చిత్రం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించే అని భావిస్తున్నారు.


 ఈ సినిమా నిజ జీవితంలోనే ఏ వ్యక్తిని ఉద్దేశించి తీసింది కాదని.. పార్టీ పెట్టి ఓడిపోయిన ఓ స్టార్ హీరోతో తీస్తున్న ఫిక్షనల్ స్టోరీ అని.. ఎవరికైనా దగ్గరి పోలికలు ఉంటే ఇది యాదృచ్చికంగా జరిగింది మాత్రమే అని చెప్పుకొచ్చాడు. వర్మ ఎంత చెప్పినా అది పవన్ కళ్యాణ్ పై సెటైరికల్ గా తీస్తున్న సినిమా అని అందరికి తెలిసిన విషయమే. పవర్ స్టార్ ట్రైలర్ రిలీజ్  అయినప్పటి నుంచి అది చూసిన ప్రతి పవర్ స్టార్ అభిమాని వర్మ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత కథ అంటూ వర్మ చూపించిన ఈ ట్రైలర్ చూసి ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ని అభిమానించే సినీ ప్రముఖులు కూడా వర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ యువ హీరో  నిఖిల్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. శిఖరాన్ని చూసి కుక్క ఎంత మొరిగినా.. ఆ మహా శిఖరం తల తిప్పి చూడదు.. మీకు అర్థం అయిందిగా అంటూ ట్వీట్ పెట్టారు నిఖిల్. దీనికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించి బంగారం సినిమాలోని పవన్ కళ్యాణ్ గిఫ్ జత చేసాడు. ఈ ట్విట్ చుసిన తరువాత నిఖిల్ కుక్కతో పోల్చింది వర్మనే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ట్విట్ లో నిఖిల్ వర్మ పేరుని వాడకపోయినా కూడా ..ఇండైరెక్ట్ గా ఆ కుక్క వర్మ నే అని అందరూ చర్చించుకుంటున్నారు. దీనిపై నెటిజన్స్ కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిఖిల్ కి మద్ధతుగా  నిలుస్తున్నారు. నిఖిల్  చేసిన ట్విట్‌కు తెగ లైకులు.. కామెంట్స్ పెడుతున్నారు. ఇక వర్మ ఈ  పవర్ స్టార్ సినిమా  జులై  25న ఆర్జీవీ వరల్డ్‌ థియేటర్‌లో విడుదలకానున్నట్లు ప్రకటించాడు   

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు