డైలాగ్ కింగ్ నుండి కలెక్షన్ కింగ్ గా మోహన్ బాబు ఎలా మారాడు !

inner-page-banner

భక్తవత్సలం నాయుడుని మోహన్ బాబుగా మార్చి టాలీవుడ్ లో ఓ స్థానాన్ని దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు కల్పిస్తే, ఆతర్వాత ఎందరో దర్శకుల అండతో మోహన్ బాబు స్టార్ హీరో అయ్యాడు. తెలుడు సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా అడుగుపెట్టి ఆ తర్వాత హీరోగా , విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యే ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటుడు మోహన్ బాబు హీరోగా అవతారం ఎత్తి తన సత్తా చాటాడు. అయితే డైలాగ్ డెలివరీలో తనకంటూ ఓ ప్రత్యేక శైలి గల మోహన్ బాబుని డైలాగ్ కింగ్ అనేవారు.కానీ ఆతర్వాత కలెక్షన్ కింగ్ గా మారారు. దీనికి పెద్ద కారణమే ఉందని అంటారు. చాలామంది దర్శకులతో మోహన్ బాబు పనిచేసాడు.  అయితే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోహన్ బాబు, దర్శకుడు బి.గోపాల్ సూపర్ హిట్ కాంబినేషన్. వీళ్ల కలయికలో మొత్తంగా నాలుగు చిత్రాలు తెరకెక్కితే.. అన్నీ విజయం సాధించాయి. సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అయింది. అంతేకాదు, మోహన్ బాబుకు కలెక్షన్ కింగ్ బిరుదు రావడం వెనక బి.గోపాల్ ఉన్నారు.


Also Read: టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఎవరు ..... పవన్ కళ్యాణ్ & ప్రభాస్ !

వీళ్ళ కాంబోలో మొదటి చిత్రం అసెంబ్లీ రౌడీ. తమిళంలో సత్యరాజ్ హీరోగా నటించిన వేలై కిడాయిచు డుచు మూవీకి రీమేక్ గా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఈ మూవీ సక్సెస్‌తో మోహన్ బాబుకి కలెక్షన్ కింగ్ బిరుదు చేరింది. ఈ సినిమా తర్వాత హీరోగా మోహన్ బాబు హీరోగా స్టార్ డమ్ అందుకోవడమే కాదు, వెనుదిరిగి చూసుకోలేదు. వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన రెండో చిత్రం బ్రహ్మ. ఈ సినిమా కూడా తమిళంలో సత్యారాజ్ హీరోగా తెరకెక్కిన బమ్మ మూవీకి రీమేక్ కావడం విశేషం.


 మోహన్ బాబు సరసన శిల్ప శిరోద్కర్, ఐశ్వర్య హీరోయిన్స్‌గా నటించిన ఈ మూవీ కూడా మంచి విజయాన్నే అందుకుంది. ఇక మూడో చిత్రం ఎలాంటి రీమేక్ లేకుండా డైరెక్ట్ గా వచ్చిన కలెక్టర్ గారు చిత్రం కూడా బాగానే పేరొచ్చింది. కాగా మోహన్ బాబు, బి.గోపాల్ కాంబోలో వచ్చిన నాల్గో చిత్రం అడవిలో అన్న మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే అందుకుంది. మోహన్ బాబు నక్సలైట్ పాత్రలో నటించగా, రోజా హీరోయిన్ గా జోడీ కట్టింది. ఈ సినిమా తెలంగాణ పల్లెలతో పాటు శ్రీకాకుళం, ఖమ్మం, విజయనగరం వంటి నక్సలైట్ ప్రాబల్య ప్రాంతాల్లో సంచలనం రేపింది. ఇక చాలా రోజుల తర్వాత తాను ప్రధాన పాత్రాలో సన్నాఫ్ ఇండియా అనే సినిమా స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ప్రకటించారని వార్తలొస్తున్నాయి.


You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube