తెలంగాణ తో పాటుగా ఈ రాష్ట్రాల్లో మరో ఐదు రోజులు భారీ వర్షాలు .. అలర్ట్ చేసిన ఐఎండీ

inner-page-banner


ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దేశంలోని  అన్ని రాష్ట్రాల్లోనూ ప్రతి రోజూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో  నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. అయితే , ఈ వర్షాలు మరిన్ని రోజులు కొనసాగబోతున్నాయి  అని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో ఆగస్టు 12 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. ఆగస్టు 12న ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, విదర్భా, గుజరాత్‌ లో అతి భారీ వర్షాలు పడే అవకాశముంది.

Also Read: తెలంగాణ తో పాటుగా ఈ రాష్ట్రాల్లో మరో ఐదు రోజులు భారీ వర్షాలు .. అలర్ట్ చేసిన ఐఎండీ

హిమాచల్ ప్రదేశ్, బీహార్, చత్తీస్‌గఢ్, సబ్ హిమాలయన్ వెస్ట్ బెంగాల్, సిక్కిం, ఒడిశా, అసోం, మేఘాలయ, మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఘాట్ ప్రాంతాలు, కొంకణ్, గోవా, తెలంగాణ, కోస్టల్ కర్నాటకలో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరించింది. ఇక యూపీ, ఈస్ట్ రాజస్థాన్, బీహార్, ఝార్ఖండ్ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చు. నైరుతి, పశ్చిమ మధ్య అరేబియా తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. 5 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని స్పష్టం చేసింది.


Also Read: అత్యంత విషమంగా మాజీ రాష్ట్రపతి ఆరోగ్యం !

అలాగే , తెలంగాణలో రానున్న ఐదు రోజులు పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు. రాష్ట్రంలో నేడు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. నేడు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం పలు ప్రాంతాల్లో ఉరుములతో,మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. బుధ గురు వారాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube