విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు సువిధ పోర్టల్‌

inner-page-banner


ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాలలో కరోనా విజృంభణ ఎక్కువగా వుంది .ఈ సమయంలో విదేశాలనుంచి వచ్చిన ప్రయాణికులు చాలా సమస్యలు ఎదుర్కుంటున్నారు . ఈ సమయం లో  విదేశాల నుంచి భారత్‌కు ప్రయాణికుల రాకను సులభతరం చేసేందుకు ఢిల్లీ విమానాశ్రయంలో ‘ఎయిర్‌ సువిధ’ పోర్టల్‌ను ప్రవేశపెట్టినట్లు శుక్రవారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. 


దేశానికి వచ్చే ప్రయాణికులు తమ ఆరోగ్యస్థితిపై తప్పనిసరిగా సెల్ఫ్‌ డిక్లరేషన్‌ పత్రాన్ని సమర్పించే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించాయి. ఈ పోర్టల్‌ ద్వారా 5 విభాగాల్లో తప్పనిసరి ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌ (ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేవి) నుంచి మినహాయింపు పొందేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వీలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నాయి. శనివారం నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube