ఆ సైంటిస్టు కి రూ.1.30 కోట్ల నష్ట ప‌రిహారం చెల్లించిన కేరళ ప్రభుత్వం !!

inner-page-banner


కేర‌ళ‌ లో అధికారంలో ఉన్న పిన‌ర‌యి విజ‌య‌న్ ప్ర‌భుత్వం ఇస్రో సైంటిస్టు నంబి నారాయ‌ణ‌న్‌ కు రూ.1.30 కోట్ల న‌ష్ట ప‌రిహారం చెల్లించింది. సైంటిస్టు నంబి నారాయ‌ణ‌న్ ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా ఆయన్ని అన్యాయంగా  అరెస్టు చేసి వేధింపుల‌కు గురి చేసింది. దీనితో చేయని తప్పుకి నన్ను అన్యాయంగా శిక్షించారని , వేధింపులకు గురిచేసారు అని , ఆయ‌న కేరళ ప్రభుత్వంపై  న్యాయ ‌పోరాటం చేసి అందులో విజయం సాధించారు. ఇస్రో సైంటిస్టు నంబి నారాయ‌ణ‌న్ ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వ‌డంతో ఆయ‌న ఈ కేసులో గెలిచారు. దీంతో కేర‌ళ ప్ర‌భుత్వం ఆయ‌న‌కు ఆ మొత్తాన్ని న‌ష్ట ప‌రిహారం కింద చెల్లించింది.


Also Read: తెలంగాణ తో పాటుగా ఈ రాష్ట్రాల్లో మరో ఐదు రోజులు భారీ వర్షాలు .. అలర్ట్ చేసిన ఐఎండీ

కాగా , ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే  .. 1994లో కీల‌క‌మైన ర‌క్ష‌ణ విభాగం ర‌హ‌స్యాల‌ను మాల్దీవియ‌న్ ఇంటెలిజెన్స్ ‌కు చేర‌వేశార‌న్న ఆరోప‌ణ‌లతో నారాయ‌ణ‌న్‌ ను  2019 డిసెంబ‌ర్ ‌లో కేర‌ళ ప్ర‌భుత్వం అరెస్టు చేసింది. ఆ తర్వాత  50 రోజుల పాటు క‌స్ట‌డీలోనే  ఉన్నారు. ఆ స‌మ‌యంలో ఆయ‌నను వేధింపుల‌కు గురి చేయ‌డంతో ఆయ‌న నేరం చేయ‌క‌పోయినప్పటికీ , చివ‌ర‌కు ఆ నేరం చేసినట్టు అంగీక‌రించే స్థితికి వ‌చ్చారు. అయితే ఇంత‌లో సీబీఐ రంగ ప్ర‌వేశం చేసి కేసు పూర్వాప‌రాల‌ను విచారించింది. ఈ క్ర‌మంలో నారాయ‌ణ‌న్‌ను త‌ప్పుగా అరెస్టు చేశార‌ని, ఆయ‌న ఆ నేరం చేయ‌లేద‌ని సీబీఐ తేల్చింది. దీంతో సుప్రీం కోర్టు నారాయ‌ణ‌న్‌ కు అనుకూలంగా తీర్పు వెల్లడించింది. అలాగే నష్ట పరిహారం కింద  మొత్తం రూ.1.20 కోట్లను చెల్లించాల‌ని చెప్పింది. అయితే ఇప్ప‌టికే అందులో రూ.60 ల‌క్ష‌ల‌ను ఆయ‌న‌కు చెల్లించ‌గా.. మిగిలిన మొత్తాన్ని కేర‌ళ ప్ర‌భుత్వం ఆయ‌న‌కు తాజాగా అంద‌జేసింది.

Also Read: అత్యంత విషమంగా మాజీ రాష్ట్రపతి ఆరోగ్యం !

ఇక హ్యూమ‌న్ రైట్స్ వారు కూడా రూ.10 ల‌క్ష‌ల‌ను ఆయ‌న‌కు న‌ష్ట ప‌రిహారం కింద చెల్లించాల‌ని కేర‌ళ ప్ర‌భుత్వాన్ని ఆదేశించారు. దీంతో మొత్తం క‌లిపి ఆయ‌న‌కు రూ.1.30 కోట్ల నష్ట ప‌రిహారం అందింది.ఇకపోతే , నారాయ‌ణ‌న్ కు మోదీ ప్ర‌భుత్వం గ‌తంలో ప‌ద్మ భూష‌ణ్ అవార్డు ఇచ్చింది. నారాయ‌ణ‌న్ కేసు విష‌య‌మై కేర‌ళ‌లోని త్రిసూర్‌లో గ‌తంలో మోదీ నిర్వ‌హించిన ఓ ర్యాలీలో ఆయ‌న కేర‌ళ ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. రాజ‌కీయ ల‌బ్ధి కోసం ఓ సైంటిస్టు పేరు ప్ర‌తిష్ట‌ల‌కు భంగం క‌లిగించే ప‌నిచేస్తున్నార‌ని అన్నారు. ఇక నారాయ‌ణ‌న్ అరెస్టు కాక‌ముందు ఆయ‌న ఇస్రోలోని క్ర‌యోజెనిక్స్ విభాగంలో ప‌నిచేస్తుండేవారు. ఆయ‌న లిక్విడ్ ఫ్యుయ‌ల్ రాకెట్ టెక్నాల‌జీని అభివృద్ధి చేశారు. అప్ప‌టి వ‌ర‌కు రాకెట్ల‌లో సాలిడ్ మోటార్స్ ను వాడేవారు. కానీ ఆయ‌న డెవ‌ల‌ప్ చేసిన టెక్నాల‌జీ వ‌ల్ల రాకెట్లలో ఆ ఫ్యుయ‌ల్‌ను వాడ‌డం మొద‌లుపెట్టారు. మొద‌టిసారిగా పీఎస్ఎల్‌వీని లాంచ్ చేసిన‌ప్పుడు కూడా నారాయ‌ణ‌న్.. వికాస్ ఇంజిన్ పేరిట ఓ ఇంజిన్ డెవ‌ల‌ప్ చేసి అందులో ఉప‌యోగించారు. 

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube