మహేష్ ఫ్యాన్స్ వరల్డ్ రికార్డ్ .. పవన్ ఫ్యాన్స్ కి పెద్ద సవాలే!

inner-page-banner

ప్రస్తుతం స్టార్స్ హవా మొత్తం సోషల్ మీడియా లో నే కొనసాగుతుంది. ఒకప్పుడు సెంటర్స్ , రికార్డ్స్ , కలెక్షన్స్ కానీ , ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ మొదలైంది. దీనితో తమ అభిమాన హీరోనే  తోపు అని నిరూపించుకునే పనిలో పడ్డారు అభిమానులు. ఏ చిన్న సందర్భం దొరికినా కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ముఖ్యంగా తమ హీరోల సినిమా అప్డేట్ , తోలి పోస్టర్ , టీజర్ , మోషన్ టీజర్ , ట్రైలర్ , బర్త్ డే ..ఇలా సందర్భం ఏదైనా కూడా సోషల్ మీడియా ను షేక్ చేస్తూ తమ సత్తా చాటుతున్నారు. ఇక తాజాగా ఆగస్ట్ 9
టాలీవుడ్ టాప్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా అయన  ఫ్యాన్స్   సోషల్ మీడియాపై దండెత్తారు. తమ హీరో పుట్టిన రోజు నాడు ఆయన పేరిట ఓ భారీ రికార్డు సెట్ చేసి పెట్టారు. మహేష్ బర్త్ డే యాష్ ట్యాగ్ ని భారీగా ట్రెండ్ చేసిన ఫ్యాన్స్ కేవలం 24 గంటల్లో  60.2 మిలియన్ ట్వీట్స్ తో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. సాధారణంగా మహేష్ సినిమాల కలెక్షన్స్ ఈ రేంజ్ లో ఉంటాయి.

Also Read: మిహీకా బజాజ్ పెళ్లి డ్రెస్ ధర ఎంతో తెలుసా !

దీనితో ఈ రికార్డు ని బ్రేక్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై పడింది. ఆగస్టు లో చిరంజీవి బర్త్ డే ఉన్నప్పటికీ, ఫామ్  రీత్యా ఆ రికార్డు బీట్ చేసే అవకాశం పవన్ ఫ్యాన్స్ మాత్రమే ఉంటుంది. ఇండస్ట్రీలో తమ హీరోకి తిరుగులేదు. పవన్ కళ్యాణ్ దేవుడు అని చెప్పుకునే ఫ్యాన్స్ కి ఇదొక సవాల్ లాంటిదే అని అనుకోవచ్చు. ఎందుకు అంటే 24 గంటల్లో 60 మిలియన్ల అంటే అనుకున్నంత సులభం కాదు ..అలాగని కష్టం కూడా కాదు. పవన్ ఫ్యాన్స్ తలచుకుంటే ఏది అసాధ్యం కాదు. అలాగే ,దానికి తోడు ఆ రోజు వకీల్ సాబ్ నుండి టీజర్ కూడా రానుంది. దీనితో మహేష్ ఫ్యాన్స్ సెట్ చేసిన రికార్డు బీట్ చేయాలని పవన్ ఫ్యాన్స్ కృత నిశ్చయంతో ఉన్నారు. ఎలాగైనా ఆ రికార్డు ని బ్రేక్ చేసి మాకు సాటి లేదని నిరూపించుకోవాలని అనుకుంటున్నారు.  దీనితో మహేష్ ఫ్యాన్స్ కూడా పవన్ బర్త్ డే అయిన సెప్టెంబర్ 2 కోసం ఎదురుచూస్తున్నారు. రెండేళ్ల తరువాత పవన్ నుండి మూవీ వస్తుండగా వకీల్ సాబ్ టీజర్ ని కూడా ఫ్యాన్స్ భారీగా ట్రెండ్ చేయాలని చూస్తున్నారు.  ఐతే 90శాతం షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ 20రోజుల షూటింగ్ మాత్రమే మిగిలివుంది. ఇక సెప్టెంబ‌ర్ 2న ‘ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన రోజు’ సంద‌ర్భంగా వ‌కీల్ సాబ్ చిత్రం నుంచి ఓ స‌ర్‌ప్రైజ్‌ను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు.. ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్ తెలిపారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా అందుకు సంబంధించిన ఓ ట్వీట్ చేశాడు. కాగా ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ‘పోస్ట‌ర్స్, మ‌గువా.. మ‌గువా’ సాంగ్ కూడా ఫ్యాన్స్‌ని బాగా ఆక‌ట్టుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. చూడాలి మరి మహేష్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ లో ఎవరు రికార్డ్ సృష్టిస్తారో ..

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube