మెగాస్టార్ ఆచార్య కథ ఇదే !

inner-page-banner

మెగాస్టార్ చిరంజీవి మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తరువాత వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు. అలాగే ఆ సినిమాలని సామజిక నేపథ్యంతో సమాజానికి ఎదో ఒక మెసేజ్ ఇచ్చే సినిమాల్లో నటిస్తున్నారు. రీఎంట్రీ ఖైదీ no 150 లో రైతుల గురించి , నీళ్ల కోసం రైతులు పడే కష్టాలని కళ్లకి కట్టినట్టు చూపించిన చిరంజీవి ఆ తరువాత సైరా నరసింహారెడ్డి సినిమాతో చరిత్ర మరచిన తోలి తరం స్వాసంత్య్ర సమరయోధుడు గురించి నేటి తరానికి తెలియజేసాడు. అలాగే మెగాస్టార్ అలాంటి పాత్ర చేయడం ..చిరంజీవి సినీ కెరియర్ లో మొదటిసారి. ఇక ప్రస్తుతం మెగాస్టార్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి దేవాదాయ, ధర్మదాయ శాఖలో పనిచేసే ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. దేవాలయాలను నిర్లక్ష్యం చేయడం వలన  సమాజంపై ఎంత చెడు ప్రభావం చూపుతాయనేది ఈ సినిమా కాన్సెప్ట్. కొంత షూటింగ్ చేసాకా.. కరోనా లాక్‌డౌన్ నిబంధనల కారణంగా ఈసినిమా షూటింగ్ అన్ని సినిమాల వలే ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. అయితే షూటింగ్స్ కి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో...అతి త్వరలో  ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు.

ఇక అసలు విషయానికొస్తే ... ఆచార్య..మన దేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు చాలా ఎక్కువ. చాలా ఏళ్ల క్రితం.. అంటే రాజుల కాలంలో ఆనాడు రాజ్యాలని పరిపాలిస్తున్న రాజులు తమ రాజ్యంలో ఆలయాన్ని కట్టించి ..ఆ ఆలయానికి కొన్ని వేల ఎకరాల భూమిని దానంగా ఇచ్చేవారు. ఆ తరువాత ఆ భూమిపై వచ్చే ఆదాయంతో గుడి నిర్వహణ చేసేవారు. ఆ ఆచారం ఈనాటికి కొనసాగుతూవస్తుంది. దేశంలోని ప్రతి ఆలయ వ్యవహారాల్ని చూడటానికి ఒక ఎండోమెంట్ ఆఫీసర్ ఉంటారు. దేవాదాయ, ధర్మదాయ శాఖలో ఈ ఎండోమెంట్ ఆఫీసర్  కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఆ ఆలయ వ్యవహారాలన్నీ కూడా ఆ ఎండోమెంట్ ఆఫీసర్ కనుసన్నల్లోనే జరుగుతుంటాయి. ఇకపోతే, కాలక్రమేణా ప్రతి ఒకరు అడ్డదారులు తొక్కుతూ అప్పట్లో రాజులు ఆలయానికి దానాదత్తంగా ఇచ్చిన భూములని కాజేస్తూవస్తున్నారు. ఈ భూ అక్రమాల వెనుక చాలామంది ప్రముఖులు కూడా ఉంటారు. ఆ ఆలయ ఎండోమెంట్ ఆఫీసర్ ను బెదిరించో..బయపెట్టో...డబ్బు చూపో ..ఆలయానికి చెందిన ఆస్తులని కాజేస్తుంటారు. దానికి ఓ ఎండోమెంట్ ఆఫీసర్  ఒప్పుకోరు. దీనితో ఆ ఆలయ భూములు ఎలాగైనా చేజికించుకోవాలనే లక్ష్యంతో ఆ అధికారిని కూడా చెంపేస్తారు. ఆ ఆఫీసర్ తమ్ముడే మెగాస్టార్ చిరంజీవి...ఇక్కడ మరో ముఖ్య  విషయం..చిరంజీవి అన్నయ్య పాత్రలో ఎండోమెంట్ ఆఫీసర్ గా నటిస్తున్నది మలయాళ స్టార్ మోహన్ లాల్. ఇది సినిమాకి ఓ కీలక టర్నింగ్ పాయింట్. 


అప్పటివరకు ఎంతో హాయిగా సాగుతున్న వారి జీవితం అన్నయ్య మరణంతో చిన్నాభిన్నం అవుతుంది. దానితో ఆ ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి, ఎన్నో అడ్డంకులను తొలగించుకొని చివరికి ఆ ఎండోమెంట్ ఆఫీసర్ గా అన్నయ్య స్థానంలో భాద్యతలు స్వీకరిస్తారు. ఆ కుర్చీలో కూర్చున్న తరువాత అక్కడ జరిగే అక్రమాలు..ఆ అక్రమాలని పసిగట్టి ప్రశ్నించినందుకు తన అన్నయ్యను చంపేశారు అని తెలుసుకుంటాడు. ఆ తరువాత అన్నయ్య చావుకి కారణమైన వారిని రోడ్డుకి ఈడ్చి .. దేవాదాయ, ధర్మదాయ శాఖలో జరిగే అక్రమాలని బయటపెట్టడమే ఈ సినిమా కాన్సెప్ట్.  ఈ  సినిమాలో మరో కీలక పాత్ర కోసం రామ్ చరన్ లేదా  మహేష్ బాబు ను అనుకుంటున్నారు. సినిమాకి ఫ్రీ క్లైమాక్స్ లో వచ్చే ఆ పాత్ర సినిమాకి మరో టర్నింగ్ పాయింట్.మొత్తంగా ఈ సినిమా మొత్తం ఆలయాల చుట్టూనే తిరిగుతూఉంటుంది...సోషల్ మెసేజ్ తో సినిమా తీయడం కొరటాల శివకి వెన్నతో పెట్టిన విద్యలాంటిది. కాబట్టి ఆ  దేవాదాయ, ధర్మదాయ శాఖలో జరిగే అక్రమాలని ఈ ఆచార్య సినిమా ద్వారా అందరి ముందు బయటపెట్టనున్నారు. ఏదేమైనా సినిమా స్టోరీ వింటుంటూనే రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి ..ఆ అక్రమాలని బయటపెట్టే పాత్రలో చిరంజీవి ఒదిగిపోవడం ఖాయం అని చెప్పవచ్చు.  

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube