ధోని ప్రాక్టిస్ షురూ .. హెలికాప్టర్ షాట్ల కోసం ఫ్యాన్స్ ఎదురుచూపు !

inner-page-banner


ఐపీఎల్‌ సన్నాహకాలను చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్పీడ్ పెంచింది. సెప్టెంబర్ నెల 19 నుంచి జరగబోయే ఐపీఎల్  కోసం మిగతా జట్లు ఎప్పటి నుంచి ప్రాక్టీస్‌ చేస్తాయో స్పష్టత లేకపోయినప్పటికీ .. ధోనీ సేన మాత్రం ఈ విషయంలో క్లారిటీగానే ఉంది. ఈనెల 15 నుంచి ఎంఎ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్  ఆటగాళ్లు ఓ వారం రోజుల పాటు ప్రాక్టీస్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈమేరకు ఫ్రాంచైజీ యాజమాన్యం ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం నుంచి అనుమతి కూడా పొందింది.  ఈ క్యాంపులో ధోనీ, రైనా, రాయుడు, హర్భజన్‌ సింగ్‌, పియూష్‌ చావ్లా తదితర స్వదేశీ ఆటగాళ్లు పాల్గొనబోతున్నారు. వీరంతా ఈనెల 14నే ప్రత్యేక విమానం లో చెన్నైకి చేరుకుంటారు. కరోనా కారణంగా చాలా కాలం పాటు ఆటగాళ్లకు శిక్షణ లేకుండా పోయింది. అందుకే వారం రోజుల పాటు ఇక్కడే తగిన ప్రాక్టీస్‌ చేస్తే బాగుంటుందని ధోనీ సూచించాడని టీమ్‌ మేనేజ్‌మెంట్ తెలిపింది.


ఇకపోతే , భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ధోని మళ్ళీ ప్రాక్టిస్ మొదలుపెట్టేశాడు. దుబాయ్‌ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 13వ సీజన్‌ ప్రారంభం అవుతున్న నేపధ్యంలో ధోని తన ప్రాక్టిస్ ను మొదలుపెట్టాడు. గత ఏడాది న్యూజిలాండ్ జట్టుతో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ తర్వాత మళ్ళీ ధోని జట్టులో కనిపించింది లేదు.. దాదాపుగా ధోనిని మైదానంలో చూసి 14 నెలలు అయింది.అయితే తాజాగా ఐపీఎల్‌ 13వ సీజన్‌ గ్రీన్‌ సిగ్నల్ రావడంతో మళ్ళీ రాంచీలో నెట్స్‌లో సాధన చేస్తున్నాడు ధోని.. ఇక ఆటగాడు సురేష్ రైనా చెప్పిన ఒక రోజు తర్వాత.. మహీ ప్రాక్టీస్ ఆరంభించడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు.. ఇదే విషయాన్ని జార్ఖండ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ వెల్లడించింది. ఇక గత మార్చిలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్వహించిన శిక్షణా శిబిరంలో ధోని పాల్గొన్నాడు. కానీ ఆ తరవాత కరోనా మహమ్మారి రావడంతో తిరిగి రాంచీకి వెళ్ళిపోయాడు. ధోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించి 2010, 2011,2018 సంవత్సరంలో టైటిల్ ని అందించాడు. గత సీజన్ లో కొద్దిలో కప్ మిస్ అయింది. అయితే , ఈ సారి టైటిల్ ద్యేయంగా బరిలోకి దిగుతున్నారు.ధోని యుఏఈ వేదికగా జరిగే ఈ మెగా టోర్నీలో సత్తా చాటి తిరిగి అంతార్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాలని చూస్తున్నాడు. ఆగస్టు 21న ధోనీ బృందం దుబాయ్‌కి వెళుతుంది. మరోవైపు ముంబై ఇండియన్స్‌ తప్ప మరే ఇతర జట్టు కూడా స్వదేశంలో క్యాంపు ఏర్పాటు చేసే ఆలోచనలో లేదు.

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube