నారా రోహిత్ తండ్రి ఎవరు , అయాన ఏంచేస్తారో తెలుసా

inner-page-banner

టాలీవుడ్ ఎంతమంది హీరోలున్నా ఎవరికి వారు సొంతంగా వారికంటూ ఒక స్పెషల్ ఇమేజ్ అందుకున్నారు. ఇక పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన యువ హీరోలు తెలుగులో ఎక్కువగా క్లిక్కవ్వలేకపోతున్నారు. నారా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ నుంచి నారా రోహిత్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ కథానాయకుడు కొన్ని సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే కమర్షియల్ గా మనోడు ఇంతవరకు సక్సెస్ అందుకున్నది లేదు. ఓ వైపు పెదనాన్న చంద్రబాబు, మరోవైపు మామయ్య బాలయ్య బాబు సపోర్ట్ చేసినప్పటికీ ఇంకా అనుకున్నంతగా సక్సెస్ అవ్వడం లేదు.  తొలి సినిమా బాణం తోనే నటుడిగా తన స్టైల్ ఏంటో చూపించాడు. అందరి హీరోల్ల కమర్షియల్ స్టోరీల వెంట పడకుండా.. కంటెంట్ ఉన్న కథలవైపే మొగ్గుచూపి తన టేస్ట్ ఏంటో చూపించాడు. నారా రోహిత్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం మాత్రం కురిపించలేకపోతున్నారు.

ఇక అసలు విషయంలోకి వెళ్తే .. నారా రోహిత్ .. నారా అనే పేరే ఓ బ్రాండ్. అతి చిన్న వయస్సులో రాజకీయాలలోకి వచ్చి , రాజకీయాలలో చెరగని ముద్రవేశారు మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుకి  స్వయానా తమ్ముడు కొడుకు నారా రోహిత్.  నారా రోహిత్ చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు కుమారుడు. తిరుపతి రూరల్‌ చెర్లోపల్లె సమీపంలోని శ్రీవారి విల్లాస్‌లో నారా రామ్మూర్తి కుటుంబం నివసిస్తోంది. కాగా, గత కొంతకాలంగా రామ్మూర్తి ఆరోగ్యం సరిగా ఉండటం లేదని సమాచారం. అయన గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో భాదపడుతున్నారు. 


చంద్రబాబు నాయుడు చదువు పూర్తికాగానే రాజకీయాల్లోకి రావడంతో ఇంటి భాద్యతలు , సొంత ఊర్లో ఉన్న పొలాల బాధ్యతలని నారా రోహిత్ తండ్రి  రామ్మూర్తి నాయుడే చూసుకుంటూవస్తున్నారు. ఇక  తన వెనక పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఎపుడు లో ప్రొఫైల్ మెయింటేన్ చేస్తూ వస్తున్నాడు. నారా రోహిత్ కేవలం హీరోగానే కాకుండా.. నిర్మాతగా ఆరన్ మీడియా సంస్థపై పలు చిత్రాలను కూడా నిర్మించాడు. ఇ నారా రోహిత్ 1984 జూలై 25 వ తేదీన జన్మించారు. నేడు అయన పుట్టిన రోజు ... ఈ సందర్భంగా అయన సినీ కెరియర్ బాగుండాలని కోరుకుంటూ ..happy birthday to you nara rohit  

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు