ప్రేమించి పెళ్లి చేసుకున్నారు... అంతలోనే విడిపోయిన టాలీవుడ్ జంట

inner-page-banner


గత ఏడాది జనవరిలో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నటుడు, గాయకుడు నోయెల్‌, హీరోయిన్ ఎస్తేర్ తాజాగా విడాకులు తీసుకున్నారు. నోయల్, ఎస్తేర్ ల వివాహం 2019 జనవరి  3న జరిగింది. సరిగ్గా ఏడాదిన్నర గడిచేసరికి వీరి దాంపత్య విచ్ఛిన్నం కావడం బాధాకరం.వారిద్దరు తమ ట్విట్టర్‌ ఖాతాలో ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరి మధ్య ఐదారు నెలలకే సర్దుబాటు సమస్యలు వచ్చాయి. 


గత ఏడాది జూన్‌లో ఇద్దరూ మ్యూచువల్ డైవోర్స్‌కు అప్లయ్ చేసుకున్నారు. వీరిద్దరికీ విడాకులు మంజూరు చేస్తున్నట్లు కోర్టు తీర్పునిచ్చింది. అభిప్రాయ భేదాల కారణంగా తాము విడిపోతున్నామని, తమ మధ్య ఉన్న అందమైన బంధాన్ని, దాని విలువను కాపాడుకునేందుకు ఇదే సరైన నిర్ణయమని భావిస్తున్నట్లు నోయెల్ చెప్పుకొచ్చాడు. ఎస్తర్‌ భవిష్యత్‌ బాగుండాలని, తనకు అంతా మంచే జరగాలని, తను కన్న కలలు నిజం కావాలని ఆకాంక్షించాడు. విడాకుల విషయంలో తన కుటుంబాన్ని గానీ, ఎస్తర్‌ను గానీ ఇబ్బంది పెట్టేలా వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేశాడు. అలాగే కష్ట సమయాల్లో తనకు తోడుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి నోయల్‌ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు.


You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube