బుల్లితెరపై కనువిందు చేయనున్న ఎన్టీఆర్ , లక్ష్మీప్రణతి !

inner-page-banner


టాలీవుడ్ లో నందమూరి ఫ్యామిలీ కి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. స్వర్గీయ నటుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు నుండి తెలుగు సినిమాలో నందమూరి ఫ్యామిలీకి ఓ ప్రత్యేక బ్రాండ్ ఏర్పడింది. ఆ తరువాత బాలకృష్ణ , ఎన్టీఆర్ , కల్యాణ రామ్ దాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా రామారావు తరువాత బాలకృష్ణ , ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో నందమూరి వంశానికి ప్రతీకలుగా నిలుస్తున్నారు. ఇక నటన లో , డ్యాన్స్ లో ఇతర అగ్ర హీరోలతో పోలిస్తే ఒక అడుగు ఎత్తులోనే ఎన్టీఆర్ ఉన్నాడు అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. అలాగే సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ .. అలనాటి ఆ ఎన్టీఆర్ మళ్లీ ఈ బుల్లి ఎన్టీఆర్ లా పుట్టాడు అని చెప్తుంటారు. తాతకి తగ్గ మనవడిగా ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకొని ..స్టార్ హీరోగా , ఇతర స్టార్ హీరోలలో సన్నిహితంగా కొనసాగుతున్నారు.


Also Read: నితిన్ తండ్రి ఎవరో తెలుసా .. అయన ఎంత పెద్ద డిస్ట్రిబ్యూటరో తెలిస్తే షాక్ అవుతారు !

ఇక అసలు విషయానికొస్తే..నందమూరి కుటుంబంలో హీరోలే తప్ప, వారి ఇంటి ఆడవారు పెద్దగా మీడియా ముందుకురారు. ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి , కళ్యాణ్ రామ్ భార్య స్వాతి ఏదైనా సినిమా ఆడియో ఫంక్షన్స్ , సినిమా షూటింగ్స్ లో పాల్గొంటుంటారు. ఆ ఫోటోలు మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అంతే తప్ప ఎంతవరకు ఏ షో లో కూడా జంటగా పాల్గొనలేదు. కానీ, మొట్ట మొదటిసారిగా ఎన్టీఆర్ సతీసమేతంగా ఓ షో లో పాల్గొనబోతున్నారు. కరోనా కారణంగా ప్రస్తుతం సినిమా షూటింగ్స్ అన్ని బంద్ అవ్వడంతో ఇంట్లోనే ఉన్నారు. ఈ తరుణంలో తెలుగు ప్రముఖ ఛానెల్ అయిన ఈటీవీ ఎన్టీఆర్ దంపతులతో ఆగస్టు 15 న స్వాసంత్య్ర దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేక ఈవెంట్ ఏర్పాటు చేయబోతున్నట్టు ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ షో మల్లెమాల వారు చేయబోతున్నట్టు సమాచారం. ఎలాగూ ఇంట్లోనే ఉండటం, అందులో ఈటీవీ తో ఎన్టీఆర్ కి ప్రత్యేకమైన అనుబంధం ఉండటంతో ఎన్టీఆర్ కూడా సతీసమేతంగా ఈ షో లో పాల్గొనడానికి సముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. దీనికి ఓ స్టార్ యాంకర్ వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారు. ఈ విదంగా మొట్టమొదటి సారి ఓ షో లో తారక రాముడు, తన సీతా దేవితో కలిసి పాల్గొనబోతున్నారు. ఇకపోతే , ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా లో రామ్ చరణ్ కూడా మరో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ భారీ మల్టీ స్టారర్ సినిమా టాలీవుడ్ దర్శక ధీరుడు జక్కన్న దర్శకత్వంలో రూపుదిద్దుకుంటుంది.

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube