నితిన్ పెళ్లికి వెళ్లిన పవన్ .. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు..ఏంటో చూడండి !

inner-page-banner

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ ఎట్టకేలకు పెళ్లి పీఠలు ఎక్కబోతున్నాడు. తన ఫియాన్సీ షాలిని కందుకూరిని నితిన్ హైదరాబాద్ లోనే ఈ జూలై 26 న వివాహం చేసుకోనున్నాడు. ఈ తరుణంలో  నితిన్ ఇంట‌ పెళ్లి సందడి జోరందుకుంది.  బుధవారం నుంచి పెళ్లి వేడుకలు మొద‌ల‌య్యాయి. ఆ రోజున‌ నితిన్ షాలినిల కుటుంబ పెద్ద‌లు ఇరువైపులా తాంబూళాలు మార్చుకుని నిశ్చితార్థం ప‌రిమిత అతిథుల స‌మ‌క్షంలో నిర్వ‌హించారు. తాజగా నితిన్ ను పెళ్లి కొడుకును చేసే వేడుక జ‌రిగింది. ఈ వేడుక‌కు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్, నిర్మాత రాధా కృష్ణ వచ్చి కాబోయే పెళ్ళికొడుకు నితిన్ ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. పవన్ కళ్యాణ్‌ కు టాలీవుడ్‌లో ఉన్న భక్తుల్లో నితిన్ కూడా ఒకరు. 


ఈయన్ని అభిమాని అనడం సరికాదు.. ఎందుకంటే నరనరాల్లో పవన్‌పై ప్రేమను నింపుకున్నాడు నితిన్. అందుకే నితిన్ ను పవన్ కు భక్తుడు అని అంటారు. అలాంటి హీరో ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాడు. మొన్నటికి మొన్న స్వయంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మరీ తన పెళ్లికి రావాలంటూ ఆహ్వానించాడు. అందులో భాగంగానే ఇప్పుడు నితిన్ పెళ్లి కొడుకు ఫంక్షన్‌కు పవన్ కళ్యాణ్ వచ్చాడు. ఏప్రిల్ లోనే జరగాల్సిన పెళ్లి  కరోనా కారణంగా ఇప్పటి వరకు వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు కూడా ఘనంగా కాకుండా కరోనా నిబంధనలకు లోబడి ఈ పెళ్లి జరిపిస్తున్నారు కుటుంబ సభ్యులు. దీనికి టాలీవుడ్ నుంచి కానీ.. రాజకీయ రంగం నుంచి కూడా అతికొద్ది మంది మాత్రమే హాజరు కానున్నారు.

ఇక అసలు విషయంలోకి వెళ్తే ..పవన్ వీరాభిమాని పెళ్లి కావడంతో ఈ పెళ్లి వేడుకకి పవన్ కళ్యాణ్ హాజరు అవుతారు అని ముందు నుండి అందరూ అనుకుంటున్నట్టే పవన్ నితిన్ పెళ్లి మెహిందీ వేడుకకి హాజరై తన అభిమానిని ఆశ్చర్యపరిచాడు, ఆ వేడుకలో పవన్ కళ్యాణ్ ను చూసిన నితిన్ ఎనలేని ఆనందానికి గురైయ్యాడు. ఈ పెళ్లికి వచ్చిన పవన్ కళ్యాణ్ నూతన వధూవరులని ఆశీర్వదించి ... నితిన్ కి ఓ గిఫ్ట్ ఇచ్చాడు. పవన్ బుక్స్ బాగా ఎక్కువగా చదువుతారు అన్న విషయం తెలిసిందే. అలాగే పవన్ కళ్యాణ్ దగ్గర బుక్స్ కలెక్షన్స్ కూడా బాగుంటాయి. వాటిల్లో నుండి ఓ మంచి బుక్ ను నితిన్ కి గిఫ్ట్ గా ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఆ గిఫ్ట్ చూసిన నితిన్ చాలా సంతోషపడ్డాడు.   నితిన్ వేడుకకు పవన్ వచ్చిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అందులో పవన్ గెటప్ కూడా చాలా భిన్నంగా ఉంది. నితిన్ కూడా తన వేడుకకు వచ్చిన పవన్, త్రివిక్రమ్, చినబాబుకు మనసారా కృతజ్ఞతలు తెలిపాడు. ఇక కరోనా నుండి పరిస్థితులు చక్కబడిన తర్వాత ఘనంగా పార్టీ ఇవ్వాలని చూస్తున్నాడు నితిన్. కాగా, జూలై 26న హైద‌రాబాద్‌లో రాత్రి 8:30 గంట‌ల‌కు షాలిని మెడ‌లో మూడు ముళ్లు వేయ‌నున్నారు. కరోనా విషయంలో ప్ర‌భుత్వ నియ‌మ నిబంధ‌న‌ల‌ను అనుస‌రిస్తూ, త‌గిన జాగ్ర‌త్త‌లు పాటిస్తూ వివాహ వేడుక‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ వేడుక‌కు కేవ‌లం ఇరు కుటుంబాల‌వారు, స‌న్నిహిత స్నేహితులు మాత్రమే హాజ‌ర‌వ‌నున్నారు.

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు