ఖుషి లో పవన్ నిజంగా భూమిక నడుము చూడలేదు.. ఆ సీన్ వెనుక ఉన్న కష్టం ఇదే !

inner-page-banner


పవర్ స్టార్  పవన్‌ కల్యాణ్‌ సినీ కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్స్ , మరెన్నో బ్లాక్ బ్లాస్టర్ హిట్స్ ఉన్నప్పటికీ , పవన్ సినీ కెరియర్ లో    ‘ఖుషీ’ చిత్రానికి ఓ ప్రత్యేక స్థానముంది. పవన్ కళ్యాణ్‌.. భూమిక హీరో , హీరోయిన్లుగా  నటించిన ఈ చితాన్ని ఎస్‌.జె.సూర్య తెరకెక్కించారు. కొత్త దనం నిండిన సరికొత్త ప్రేమకథతో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో దక్షిణాదిలో సినీప్రియుల హృదయాలు కొల్లగొట్టింది. ముఖ్యంగా ఆ చిత్రంలోని పాటలకు అభిమానులు , ప్రేక్షకులు ఫిదా అయ్యారు.  పవన్ కళ్యాణ్‌ లవ్‌ , యాక్షన్‌ హంగామాకు కుర్రకారు ఉర్రూతలూగిపోయింది. ఇక ముఖ్యంగా ఆ సినిమాలో పవన్‌.. భూమిక నడుము చూసే సన్నివేశం చాలా హైలైట్‌ అయ్యింది. ఇప్పటికి కూడా ఆ సన్నివేశాన్ని అనేక సినిమాల్లో , షోలలో దాన్ని అనుసరిస్తుంటారు.

Also Read :బిగ్ బాస్ లోకి ఆ జబర్దస్త్ స్టార్ కమెడియన్

అయితే ఈ రొమాంటిక్‌ సీన్‌ వెనుక ఓ ఆసక్తికర కథ ఉంది. నిజానికి తెరపై అంత చక్కగా పండిన ఆ సన్నిశం వెనుకు పవన్‌ అత్యద్భుతమైన నటన దాగి ఉందట. పవన్‌ భూమిక నడుమును చూసే సన్నివేశాలను ఆ సమయంలో ఆయన ముఖంలో పలికిన హావభావాలు చూస్తే నిజంగా భూమికను పవన్‌ ఎదురుగా కూర్చోబెట్టి ఆ సన్నివేశం చిత్రీకరించారేమో అని  అనిపిస్తుంది. సినిమా కదా భూమిక ఎదురుగానే పవన్ అలా చేసారు అని కూడా చాలామంది అనుకోని ఉంటారు. కానీ, వాస్తవమేంటంటే పవన్‌ నిజంగా ఆమె నడుమును చూడలేదట. సూర్య పవన్‌ను ఓ బల్లపై కూర్చోబెట్టి ఎదురుగా భూమిక ఉన్నట్లు, ఆమె నడుమును చాటుగా గమనిస్తున్నట్లుగా చేసి చూపమన్నారట. అలా షూట్‌ చేసిన సన్నివేశాన్నే తర్వాత భూమిక సన్నివేశాలతో కలిపి చూపించారు. అంతేకాని ఆ ఎపిసోడ్‌లో చూపించినట్లు పవన్‌.. భూమిక నడుమును నిజంగా చూడలేదు. కానీ, తెరపై ఆ సన్నివేశం చూస్తున్నప్పుడు ఎంతో వాస్తవికంగా కనిపిస్తుంటుంది. అలాగే ఆ సినిమా ఇప్పుడు చూసినా కూడా ఫ్రెష్ నెస్ అలాగే ఉంటుంది. 


You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube