రెండుసార్లు తృటిలో ప్రణబ్ కి చేజారిన ప్రధాని పదవి

inner-page-banner

ప్రణబ్‌ ముఖర్జీ.. దేశ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా, దేశ  ఆర్థిక మంత్రిగా, రాష్ట్రపతిగా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నప్పటికీ ఆయనకి  రెండు సార్లు ప్రధానమంత్రి పదవి తృటిలో చేజారింది. స్వాసంత్య్ర  భారతదేశ చరిత్రలో సింహభాగం రాజకీయ యవనికపై ప్రణబ్‌ ముద్ర ప్రత్యేకం. వివిధ అంశాలపై ఆయనకు ఉన్న అవగాహన.. అసాధారణ నైపుణ్యం అమోఘం. అందుకే సాధారణ క్లర్క్‌ స్థాయి నుంచి ఎదిగి దేశ అత్యున్నత రాష్ట్రపతి పదవిని అలంకరించారు. అలాంటి ఆయనకు మాత్రం ప్రధాని పదవి మాత్రం దక్కలేదు.గత  ఐదు దశాబ్దాల నుండి  కాంగ్రెస్‌ జెండాను భుజాన మోసిన దాదాకు ప్రధాని పదవి రెండుసార్లు అందినట్టే అంది చేజారింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం నిబంధనల ప్రకారం.. పార్టీలోని సీనియర్‌ నేత ప్రధాని పదవిని చేపట్టాల్సి ఉంది. ఇదే రాజీవ్‌గాంధీ, దాదా మధ్య మనస్పర్ధలకు కారణమైంది. ఇందిర హత్య సమయంలో రాజీవ్‌, ప్రణబ్‌ బెంగాల్‌లో ప్రచార కార్యక్రమంలో ఉన్నారు. అప్పుడు తాత్కాలిక ప్రధాని ఎవరు అవుతారు అని రాజీవ్‌ దాదాను అడిగారట. పార్టీలోని సీనియర్‌ నేత ప్రధాని పదవి చేపడుతారని నెహ్రూ, లాల్‌బహదూర్‌శాస్త్రీ మరణానంతరమూ అదే జరిగిందని ప్రణబ్‌ చెప్పారని పలువురు రాజకీయ విశ్లేషకులు చెప్తారు. ఈ వ్యాఖ్యలతో ఆగ్రహం చెందిన రాజీవ్‌.. ప్రణబ్‌ హోదాను తగ్గించారని అంటుంటారు. ఇలా దాదా తొలిసారిగా ప్రధానిగా పని చేసే అవకాశాన్ని కోల్పోయారు. రాజీవ్‌ దుర్మరణంతో పీవీ నర్సింహరావు కాంగ్రెస్‌ నాయకత్వ బాధ్యతలు చేపట్టిన ప్రధాని అయ్యారు. వాస్తవానికి పీవీ కంటే ప్రణబ్‌నే సీనియర్‌. అయితే అంతకు ముందు ఆయన పార్టీని వీడి మళ్లీ చేరినందున.. పార్టీ సిద్ధాంతం ప్రకారం సాంకేతికంగా కొత్త నేత అయ్యారు. ఫలితంగా సీనియర్‌ జాబితాలో వెనుకంజలో నిలిచిపోయారు. ఇలా మరోసారి ఆయన ప్రధాని పదవి దూరమైంది.

Also Read: అస్తమించిన దాదా !

ఇకపోతే , భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం  సాయంత్రం ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మరణంతో దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. 


You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube