అత్యంత విషమంగా మాజీ రాష్ట్రపతి ఆరోగ్యం !

inner-page-banner


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం విషమంగా ఉంది.  ఢిల్లీలోని  ఆర్మీ రిసెర్చ్‌ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ప్రణబ్ ముఖర్జీకి క్లిష్టమైన శస్త్రచికిత్స చేశామని ఆర్మీ ఆర్ఆర్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. చికిత్స తరవాత కూడా ఆయన పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్లు చెప్పారు. వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతుందని మంగళవారం విడుదల చేసిన మెడికల్ బులిటెన్‌లో పేర్కొన్నారు. 


Also Read: జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

తనకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని సోమవారం ట్విటర్ వేదికగా ప్రణబ్ ముఖర్జీ వెల్లడించారు. తాను వేరే కారణాల వల్ల ఆస్పత్రికి వెళితే.. కోవిడ్ 19 పాజిటివ్ అనే విషయం నిర్థారణ అయ్యిందని తెలిపారు. తనను గత వారం రోజులుగా కలిసిన వారంతా సెల్ఫ్ ఐసోలేషన్ పాటించి.. కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఐతే మెదడులో రక్తం గడ్డకట్టడంతో పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. నిన్న మధ్యాహ్నం 12.07కి ఆయన తమ ఆసుపత్రిలో చేరారని వెల్లడించింది. 

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube