ఐపీఎల్ 2020 : ఆ మూడు జట్లకి షాక్ ఇచ్చిన బోర్డు .. ఆ ముగ్గురు ప్లేయర్స్ అవుట్ !

inner-page-banner


ఐపీఎల్ 2020 .. ఈ ఐపీఎల్ కూడా ట్వంటీ 20 నే.. అయితే , గ్రౌండ్ లో ఆటగాళ్లు సిక్సులు కొడితే చూడాలని ఎంతో ఆశపడిన అభిమానులు కరోనా కారణంగా ఒకేసారి అవుట్ అయిపోతున్నారు. ఇక దేశంలో రోజురోజుకి కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఇండియా లో ఐపీఎల్  నిర్వహించడం కష్టం అని భావించి యూఏఈ వేదికగా ఐపీఎల్ నిర్వహించాలని నిర్ణయం తీసుకోని అన్ని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కావాల్సిన అన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేసారు. అయితే ఊహించని విధంగా ఐపీఎల్ స్పాన్సర్ గా ఉన్న వివో తప్పుకుంది. అయినప్పటికీ ఆ స్థానం కోసం మూడు మెగా సంస్థలు పోటీ పడుతున్నాయి.


Also Read: ఐపీఎల్ చరిత్రలో అరుదైన 6 రికార్డ్స్ !

ఇక , సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు ఐపీఎల్ యూఏఈ వేదికగా జరగబోతుంది. దీనికోసం అన్ని ప్రాంఛైజీలు కూడా ఇప్పటికే కసరత్తులు కూడా ప్రారంబించింది. ఆటగాళ్ళని ఒక చోట చేర్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది. కొందరు ఇప్పటికే ప్రాక్టీస్ లో పాల్గొంటున్నారు. ఇక ఫ్రాంఛైజీలు ఆగస్టు 20 తర్వాతే తమ జట్లను యూఏఈకి పంపాలని సూచించింది. రిసార్ట్స్ లేదా స్టార్ హోటళ్ళలలో విడిది ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపింది. అలాగే కుటుంబ సభ్యులను వెంట తీసుకెళ్ళడంపై క్రికెటర్ల ఇష్టానికే వదిలేసింది. వైరస్ విజృంభణ కారణంగా ఐపీఎల్ 2020ని పూర్తి బయో సెక్యూర్ వాతావరణంలో జరగనుంది. దీని కోసం బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. ఆటగాళ్ళు అందరూ తప్పనిసరిగా బబుల్ రూల్స్‌ని ఫాలో అవ్వాలని బీసీసీఐ తెలిపింది. ఇప్పటికే CSK మేనేజ్మెంట్ ఆటగాళ్లతో పాటుగా కుటుంబ సబ్యులకి అనుమతి ఇవ్వడం లేదని తెలిపింది.  

Also Read: ఐపీఎల్‌ స్పాన్సర్‌ పడుతున్న ఆ మూడు సంస్థలు ..ఏవంటే ?

ఈ సంగతి ఇలా ఉంటే  , ఇక నిన్న మొన్నటి వరకు బీసీసీఐని వెంటాడిన కష్టాలు ఇప్పుడు ప్రాంఛైజీల ను వెంటాడుతున్నాయి. టోర్నీ దగ్గర పడుతున్న సమయంలో మూడు ప్రాంఛైజీలకు ఊహించని షాక్ తగిలింది. కరోనా కారణంగా ఆటగాళ్ళ శేయస్సును దృష్టిలో పెట్టుకుని బోర్డు స్పష్టమైన విధివిధానాల్ని రూపొందించింది. వీటిలో అతి ముఖ్యమైనది ప్రతి జట్టులో 24 మంది ఆటగాళ్ళు ఉండాలని సూచించింది. అంతకుమించి ఉండకూడదు. అయితే, ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఎదురుదెబ్బే అని చెప్పోచ్చు. ఈ మూడు జట్లు 25 మంది ఆటగాళ్ళను కలిగి ఉన్నాయి. దీంతో జట్ల నుంచి ఒక్కరిని తప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బోర్డు నియమాలను ప్రాంఛైజీలు తప్పక పాటించాల్సి ఉంటుంది కాబట్టి బోర్డు నిర్ణయాలకు బలైయ్యే ఆ ముగ్గురు యువ ఆటగాళ్లు కావచ్చు. ఏదేమైనా వారికీ ఓ మంచి అవకాశం మిస్ అయినట్టే. 

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube