మిహీకా బజాజ్ పెళ్లి డ్రెస్ ధర ఎంతో తెలుసా !

inner-page-banner


పెళ్లి అనేది జీవితంలో ఒకసారి మాత్రమే జరిగే అతిపెద్ద వేడుక. అందుకే ఎవరైనా తమకున్నంతలో ఆ పెళ్లి వేడుకను చాలా ఘనంగా  చేసుకోవాలని అనుకుంటారు. ఇక కోటీశ్వరులు, సెలెబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. పెళ్లి వేడుకకు సంబంధించిన ప్రతి విషయం చాలా గొప్పగా, గతంలో ఎవరు చేయలేని విధంగా ఉండేలా చూసుకుంటారు. పెళ్ళిలో అందరు ఎక్కుగా ప్రస్తావించేది, వధూవరుల బట్టలు మరియు నగలు, వంటకాల గురించే. ప్రముఖుల పెళ్ళిళ్ల కోసం కోట్లు తీసుకొనే డిజైనర్స్ దిగిపోతారు. ఇకపోతే , ఈ  కరోనా కాలంలో మన టాలీవుడ్ స్టార్స్ చాలామంది పెళ్లిళ్లు చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు.


Also Read: మహేశ్ HBDMaheshBabu ప్రపంచ రికార్డ్ .. 69.5 మిలియన్ ట్విట్స్ !

 నిఖిల్ , నితిన్  తాజాగా రానా కూడా ప్ ఇంటి వాడు అయ్యాడు. ఇకపోతే , కాగా ఈనెల 8న హీరో రానా మరియు మిహికా బజాజ్ ల వివాహం ఘనంగా జరిగింది. అతి కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈ వేడుకకు హాజరు కావడం జరిగింది కాగా ఈ వేడుకలో పెళ్లి కూతురు మిహికా బజాజ్ వేసుకున్న డ్రస్ ధర తెలిస్తే నోళ్లు వెళ్ళబెట్టాల్సిందే. ఏకంగా ఆ డ్రస్ కొరకు ఆమె రూ. 6 లక్షలు పెట్టారంట.   ప్రముఖ డిజైనర్ అనామిక ఖన్నా ఆ డ్రస్ ని డిజైన్ చేశారట. క్రీమ్ కలర్ లెహంగా మొత్తం హ్యాండ్ మేడ్ ఎంబ్రాయిడరీ వేయించారట. గంటల తరబడి శ్రమించి తయారు చేసిన ఆ డ్రస్ ప్రత్యేకత అదేనని తెలుస్తుంది. అందుకే ఆ డ్రెస్ ధరను అంతగా నిర్ణయించారని సమాచారం.


రానా- మిహికా బజాజ్ ల పెళ్ళికి అతిథిగా హాజరైన సమంత డ్రెస్ కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. మెహందీ వేడుక రోజున సమంత వేసుకున్న డిజైనర్ వేర్, ధర అక్షరాలా 1.59 లక్షల రూపాయలు అని తెలిసింది. ఆ డ్రెస్ ని ప్రముఖ్ డిజైనర్ అర్పితా మెహతా డిజైన్ చేయడం జరిగింది. ఏది ఏమైనా రానా- మిహికా బజాజ్ పెళ్లివేడుకలో ప్రతి విషయం ప్రత్యేకత చాటుకుంటుంది. ప్రస్తుతం  రానా దగ్గుబాటి – మిహిక బజాజ్ సత్యనారాయణ వ్రతం సందడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube