పవర్ స్టార్ రివ్యూ .. ఎవ్వరిన్ని వదలని వర్మ .. నువ్వు పవర్ స్టార్ అయ్యింది...

inner-page-banner

రామ్ గోపాల్ వర్మ ..ఈయన ఏది చేసినా అదొక సంచలనం. అసలు ఆర్జీవీనే సంచలనం. నిత్యం వివాదాలతో సావాసం చేయడం ఆయనకి అదొక అలవాటు. తాజాగా ఈయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద పడ్డారు. పవన్ పై సెటైరికల్ గా సినిమా తీస్తూ ..అయన అభిమానుల ఆగ్రహనికి గురౌతున్నారు. ఈ చిత్రానికి సంబందించి రోజుకో పోస్టర్‌ను విడుదల చేస్తోన్న వర్మ ఇటీవల గడ్డి తింటావా అంటూ ఓ పాటను, తాజాగా దీనికి సంబందించిన ట్రైలర్‌ను విడుదల చేశాడు. ఇక ఈ సినిమా ట్రైలర్‌ కు కూడా వర్మ డబ్బులు వసూలు చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. జూలై 22న ఉదయం 11 నుండి పవర్ స్టార్ ట్రైలర్ ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో అందుబాటులో ఉంటుందని.. ఈ ట్రైలర్ చూడాలంటే పే ఫర్ వ్యూ పద్ధతిలో 25 రూపాయలు చెల్లించాలని పేర్కొన్నాడు. ఇది ప్రపంచంలో మొట్టమొదటి పెయిడ్ ట్రైలర్ అని చెప్పకొచ్చాడు వర్మ. కానీ ,అనూహ్యంగా ట్రైలర్ నెట్లో ప్రత్యక్షం అయింది.  దీంతో ఆయన తన పవర్ స్టార్ ట్రైలర్‌ను తన య్యూట్యూబ్ ఛానల్‌లో విడుదల చేశాడు.

ఇక ప్రస్తుతం యూట్యూబ్ ‌లో సెన్సేషన్ సృష్టిస్తున్న  ‘పవర్ స్టార్’ ట్రైలర్  విషయానికొస్తే ...పవన్  ఫామ్ హౌస్‌లో ఏం చేస్తుంటారనే విషయంతో ట్రైలర్ ప్రారంభించిన వర్మ.. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు అంటూ రచ్చ  స్టార్ట్ చేసాడు. ప్రవన్ కళ్యాణ్ ఓటమి ఖాయంగా కనిపిస్తోంది.. భీమవరంలో ప్రవన్ కళ్యాణ్ ఓడిపోయారు.. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రెండు చోట్లా ప్రవన్ ఓడిపోయారు    చీకటి గదిలో ఒక్కడే కూర్చుని ప్రవన్ కళ్యాణ్ చూస్తున్నట్టుగా చూపించారు. ‘ఒక్క సీటు.. ఒక్క సీటు సీటు కూడా రాలేదా?? అంటూ పవర్ స్టార్ ఏడుస్తున్నాడు . ఒక్కటి వచ్చింది సార్.. కాని మీకు ఒక్కటి కూడా రాలేదు నాదెండ్ల మనోహర్ డైలాగ్ ఎంతో ఫన్నీగా అనిపిస్తుంది.  త్రివిక్రమ్ ని చొక్కా కాలర్ పట్టుకుని పవన్ ఊపేసే సీన్.. మాట్లాడితే సీఎం సీఎం అని గోలలు.. ఈలలు అంటూ పవన్ ఎమోషన్.. ఒక్కసారి నీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పరా.. నువ్ పవర్ స్టార్ అయ్యింది కానిస్టేబుల్ కొడుకుగానా?? లేక నా తమ్ముడు గానా? అంటూ చిరంజీవి డూప్ ‌తో డైలాగ్ అదిరిపోయింది. ట్రైలర్ మొత్తానికి ఇదే హైలెట్. ఇక అలాగే సత్యప్రమాణకంగా చెప్తున్నాను బ్రదర్.. మీరు ఓడిపోయినందుకు చాలా బాధపడుతున్నాను .. . మిమ్మల్ని నమ్మొద్దు... నమ్మొద్దు అని చాలా మంది చెప్పారు.. మీకో దండం సామీ.. వెళ్లండి అంటూ బయటకు పొమ్మనే సీన్ .. గగన్ సీఎం కాడు అని బాహుబలి రేంజ్‌లో రంకెలు వేశారు.. ఇప్పుడు ఆయనే సీఎం.. ఇప్పుడు ఏమంటారు’ అంటూ పవర్ స్టార్‌ని ప్రశ్నించే జర్నలిస్ట్ అవతారం ఎత్తాడు కత్తి మహేష్. 


నిన్ను అన్నయ్యను ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేది లేదు.. నువ్ అసమర్థుడివి అని.. ప్యాకేజ్ స్టార్‌వి అని.. గుండు సున్నావి అని.. అందరూ నోటికొచ్చినట్టు వాగుతుంటే.. నాకు పిచ్చి కోపం వస్తుంది తమ్ముడూ అంటూ నాగబాబుతో పవర్ స్టార్‌ ఫోన్‌లో సంభాషిస్తున్న సీన్ ఇలా సీన్ సీన్ కి పవర్ స్టార్ ను కెలికి అవతల పడేశాడు. ఇక బండ్ల గణేష్ పాత్ర విషయానికొస్తే ..  మీరు ఎన్నికల్లో ఓడిపోతే వంద కొబ్బరి కాయలు కొట్టి గుడిలో అర్చన చేయిస్తా అని మొక్కుకున్నా’ అంటూ పవర్ స్టార్ కాళ్లపై పడే సీన్ మరీ దారుణంగా ఉంది. బాబూ.. బాబూ.. మీరు సీఎం అయితే సినిమాలు చేయరు బాబు.. అప్పుడు నాతో సినిమా చేసే హీరో ఉండడు. అప్పుడు నా బతుకు బస్టాండ్ అవుతుంది బాబూ.. అంటూ బండ్ల గణేష్ పాత్రధారి చెప్పే డైలాగ్ మరీ అద్వానంగా ఉంది. ఇక రష్యన్ మహిళతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉండగా.. 

సార్ పూణె నుంచి ఫోన్ అని తన అసిస్టెంట్ ఫోన్ ఇవ్వడం.. దానికి రష్యన్ మహిళ నిలదీయడం.. నేను కాదు కదా ఫోన్ చేసిందని పవర్ స్టార్ చిరాకు పడటం చూస్తుంటే పవన్ వ్యక్తిగత జీవితాన్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసినట్టు అర్థమౌతుంది.  ఏదేమైనా .. ఈ ట్రైలర్ పై  పవన్ అభిమానుల  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్జీవీ బయట కనిపిస్తే .. తొక్కిపడేసేలా ఉన్నారు. ఇకపోతే . ఈనెల 25న ఉదయం 11 గంటలకు ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో ఈ సినిమా  రిలీజ్ కాబోతుంది. చూడాలి మరి ట్రైలర్ తోనే  ఇన్ని ప్రకంపనలు సృష్టిస్తున్న వర్మ సినిమాతో ఇంకెన్ని ప్రకంపనలు సృష్టిస్తారో 

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు