రాహుల్ ను ఆకాశానికెత్తేసిన షెల్డన్ కాట్రెల్ .. ఐపీఎల్ కోసం ఆతృతగా ఎదురుచూపు !

inner-page-banner


టీమ్ ఇండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఒక అద్భుతమైన ఆటగాడు  అని వెస్టిండీస్ పేసర్ షెల్డన్ కాట్రెల్ తెలిపాడు. ఐపీఎల్ లో  2020లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున రాహుల్ నాయకత్వంలో ఆడటం కోసం ఎదురుచూస్తున్నా అని తెలిపాడు. 2019 డిసెంబర్‌లో నిర్వహించిన ఐపీఎల్ వేలంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. కాట్రెల్‌ ను  రూ.8.5 కోట్ల భారీ ధరకి కు కొనుగోలు చేసింది. కాట్రెల్ ఐపీఎల్‌లో ఆడటం ఇదే తొలిసారి. ఐపీఎల్ 2020 మ్యాచులు సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు జరుగనున్నాయి.


Also Read: ఐపీఎల్ లో అమ్ముడుపోని ఆ నలుగురు స్టార్ విధ్వంసకర ఆటగాళ్లు వీరే

ఈ తరుణంలో తాజాగా  షెల్డన్ కాట్రెల్ మాట్లాడుతూ .. . ‌కేఎల్ రాహుల్ నాయకత్వంలో ఆడటం, మొహమ్మద్ షమీతో డ్రెస్సింగ్ రూమ్ ‌ను పంచుకోవడం, ఐపీఎల్‌లో ఆరంగేట్రం చేయడం గురించి పలు విషయాలు పంచుకున్నాడు. ఐపీఎల్‌లో ఆడటం గురించి నేను చాలా సంతోషిస్తున్నా. ఎప్పుడెప్పుడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్యామిలీతో కలిసి ఉంటానా అని ఎదురుచూస్తున్నా. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో ఆడటానికి నేను ఇష్టపడతాను. అతను అద్భుతమైన వ్యక్తి. నేను ఇప్పుడు క్రిస్ ‌గేల్‌, నికోలస్‌ పూరన్‌తో కలిసి ఆడబోతున్నా అని కాట్రెల్‌ చెప్పాడు. భారతదేశం చివరిసారిగా కరేబియన్‌లో పర్యటించినప్పుడు నేను కేఎల్‌ రాహుల్‌తో చాలా సమయం మాట్లాడాను. అతను ఒక అద్భుతమైన క్రికెటర్. ఎప్పుడూ ప్రశాంతంగా ఉన్నాడు. అతడు నాకంటే చాలా ఎక్కువ సిరీస్‌లు ఆడాడు కాబట్టి చాలా అనుభవం ఉంది అని షెల్డన్ కాట్రెల్‌ అన్నాడు. మహమ్మద్‌ షమీ గురించి మాట్లాడుతూ... షమీ మొదటి నుంచి ఐపీఎల్‌ ఆడుతున్నాడు. నా కంటే సీనియర్ల నుంచి తెలియని విషయాలను నేర్చుకుంటా. నేను ఒక విద్యార్థిని, కాబట్టి షమీ నుంచి బౌలింగ్‌ మెళకువలను నేర్చుకుంటా అని అన్నాడు.

Also Read: ధోని ప్రాక్టిస్ షురూ .. హెలికాప్టర్ షాట్ల కోసం ఫ్యాన్స్ ఎదురుచూపు !

వెస్టిండీస్‌ పేస్ బౌలర్‌ షెల్డాన్‌ కాట్రెల్‌ పేరు వినగానే వెంటనే గుర్తొచ్చేది అతడి సెల్యూట్. వికెట్ తీసిన ఆనందంలో కాట్రెల్‌ సెల్యూట్ చేసి సంబరాలు చేసుకుంటాడు. ఈ సెల్యూట్‌తో క్రికెట్ అభిమానులకు కాట్రెల్ మరింత చేరువయ్యాడు. అయితే కాట్రెల్ కేవలం బౌలింగ్ మాత్రమే కాదు బ్యాట్ కూడా జులిపిస్తాడు. ముఖ్యంగా ఐపీఎల్ కి కావాల్సిందే ఇదే. ఇకపోతే , ఈ కరీబియన్‌ పేసర్‌ ఇప్పటివరకు 49 వికెట్లు పడగొట్టాడు. కాట్రెల్ 2019 ప్రపంచకప్‌లో 8.25 సగటుతో 12 వికెట్లు తీశాడు.


You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube