CSK ఫాన్స్ కి చేదు వార్త .. ఐపీఎల్‌ నుంచి తప్పుకున్న సురేష్ రైనా

inner-page-banner

ఐపీఎల్‌ పదమూడో సీజన్‌ కోసం సాధన మొదలెట్టేందుకు సిద్ధమైన చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు కరోనా కళ్లెం వేసింది. ఆ జట్టులోని ఓ పేసర్‌తో పాటు బృందంలోని కనీసం 10 మంది సభ్యులకు (నెట్‌ బౌలర్లతో కలిపి) వైరస్‌ సోకినట్లు ఐపీఎల్‌ సమాచార వర్గాలు వెల్లడించాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఈ నెల 21న దుబాయిలో అడుగుపెట్టిన ఆ జట్టు ఆరు రోజుల తప్పనిసరి క్వారంటైన్‌ పూర్తి చేసుకుని శుక్రవారం సాధన మొదలెట్టాల్సింది. కానీ అక్కడికి చేరిన తర్వాత 1, 3, 6వ రోజు నిర్వహించిన వైరస్‌ నిర్ధరణ పరీక్షల చివరి రోజు (గురువారం) ఫలితాల ప్రకారం ఆ బృందంలోని కొంతమందికి పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. 



దీంతో ఇప్పుడా జట్టు మంగళవారం వరకూ క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, ప్రతినిధులకు అదనంగా మరో  సారి పరీక్షలు నిర్వహించారు. ఆ ఫలితాలు శనివారం రానున్నాయి. ఇప్పటికే కొన్ని జట్లు సాధన మొదలెట్టగా.. మరికొన్ని అదే బాటలో సాగుతున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో అన్ని జట్ల కంటే చివరగా సీఎస్కే ప్రాక్టీస్‌ చేయనుంది. అయితే సీఎస్కే జట్టులో ఉండి భారత్‌ తరపున ఆడే కుడి చేతివాటం పేసర్లు ఇద్దరే ఉన్నారు. ఒకరు శార్దూల్‌ ఠాకూర్‌ కాగా.. మరొకరు దీపక్‌ చాహర్‌. అయితే పాజిటివ్‌ వచ్చింది చాహర్‌కే అని వివిధ సమాచార వర్గాలు తెలిపాయి. కానీ అది అధికారిక ప్రకటన కాదు. మరి ఆ పేసర్‌ ఎవరన్నది చూడాలి. 


టీం ఇండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా ఐపిఎల్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. సురేష్ రైనా వ్యక్తిగత కారణాల వల్ల భారతదేశానికి తిరిగి వచ్చారని చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కెఎస్ విశ్వ నాథన్ తెలిపారు. అతను మిగిలిన ఐపిఎల్ సీజన్ లో అందుబాటులో ఉండరని పేర్కొన్నారు. ఈ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ సురేష్ మరియు అతని కుటుంబానికి పూర్తి మద్దతు ఇస్తుందని అన్నారు.

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube