అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ ..ఇప్పుడు స్టార్స్ ..

inner-page-banner

సినిమా ఇండస్ట్రీ అనేది ఓ మాయా ప్ర‌పంచం. బ‌య‌టినుంచి చూసేవాళ్ల‌కి అదో రంగుల‌లోకం. ఏమీ లేని స్థాయి నుంచి స్టార్లుగా ఎదిగిన వాళ్లు కొంద‌రుంటే ఎక్క‌డినుంచి మొద‌లు పెట్టారో తిరిగి అక్క‌డికే చేరేవాళ్లు మ‌రికొంద‌రుంటారు. ఒక్క సినిమా హిట్ అయితే రాత్రికి రాత్రే స్టార్లు అయిన‌వాళ్లు కూడా ఉన్నారు. అయితే ఈ క్రేజ్‌ ఎక్కువ‌కాలం నిల‌వాలంటే మాత్రం క‌ఠోర శ్ర‌మ‌, గ్లామ‌ర్, అదృష్టం..ఇలా అన్నీ క‌లిసిరావాలి లేదంటే ఇండస్ట్రీలో నెగ్గుకురావ‌డం చాలా క‌ష్టం. ఒక‌ప్పుడు స్టార్లుగా చ‌లామ‌ణి అయిన‌వాళ్లు ప్ర‌స్తుతం చాలా సాదాసీధాగా జీవ‌నం గ‌డుపుతున్నారు. ఇక కొంతమంది ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చి  పెద్దయ్యాక హీరోలుగానూ సక్సెస్ అయ్యారు. మరికొంతమంది కేవలం చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి ఆ తర్వాత నటనకి ఫుల్ స్టాప్ పెట్టేసారు..మరికొందరు సక్సెస్ కాలేకపోయారు. అయితే , మహేష్ బాబు దగ్గర నుండి అఖిల్ వరకూ సక్సెస్ బాట పట్టిన హీరోలందరూ కూడా ఒకప్పుడు తెలుగు చిత్రాలలో బాల నటులుగా తమను తాము ప్రూవ్ చేసుకున్న వారే. అలాంటి హీరోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మహేష్ బాబు : మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా నాలుగేళ్ల వయసులోనే దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన నీడ అనే చిత్రం ద్వారా.. 1979లో బాల నటుడిగా పరిచయం అయ్యాడు. ఆలా తన కెరియర్ లో  మొత్తంగా 11 ఏళ్లలో 9 చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. ఆ 1999లో రాజకుమారుడు చిత్రంతో హీరోగా పరిచయమై ప్రస్తుత టాలీవుడ్ లో  సూపర్ స్టార్ ‌గా  అగ్ర హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు.

అఖిల్ అక్కినేని : 1994లో విడుదలైన సిసింద్రీ సినిమాలో కేవలం నెలల వయసున్నప్పుడే నటించిన ఘనత అఖిల్‌కే దక్కుతుంది. ఆ తర్వాత  2014లో మనం చిత్రంలో చిన్న కెమియో రోల్‌లో కనిపించిన అఖిల్, ఆ తర్వాత 2015లో "అఖిల్" చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యారు. అయితే ఓ సూపర్ హిట్ కోసం అఖిల్ ప్రయత్నం చేస్తున్నాడు.

జూనియర్ యన్ టి ఆర్ : గుణశేఖర్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన "రామాయణం" చిత్రం ఎంత పెద్ద హిట్ చిత్రమో మనకు తెలియంది కాదు. ఈ చిత్రంలో శ్రీరాముడిగా జూనియర్ ఎన్టీఆర్ నటన అందరినీ బాగా ఆకట్టుకుంది. అంతకుముందే బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో భరతుడి పాత్రలో కూడా జూనియర్ ఎన్టీఆర్ నటించారు. 2001లో విడుదలైన "నిన్ను చూడాలని" చిత్రంతో హీరోగా టాలీవుడ్‌కి పరిచయమయ్యారు జూనియర్ ఎన్టీఆర్. ఆ తర్వాత ఇండస్ట్రీలో నందమూరి నట వారసుడిగా అగ్ర హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు.

తరుణ్ : అంజలి, తేజ, మనసు మమత, పిల్లలు దిద్దిన కాపురం లాంటి సినిమాలలో బాల నటుడిగా రాణించిన తరుణ్ కుమార్ "నువ్వే కావాలి" చిత్రంతో 2000లో హీరోగా మారారు. అదేవిధంగా ఉత్తమ బాల నటుడిగా పలుమార్లు నంది అవార్డు కూడా అందుకున్నారు.

ఆలీ : టాలీవుడ్ లో విచిత్రమైన కామెడీకి కేరాఫ్ అలీ . ఈయన 1949  కె  రాఘవేంద్ర రావు దర్శకత్వం లో నిండు నూరేళ్లు అనే సినిమా లో ద్వారా నటుడిగా తెరంగేట్రం చేసారు. ఆ తరువాత వచ్చిన సీతాకోక చిలుక చిత్రం లో బాల నటుడిగా నటించారు. ప్రస్తుతం స్టార్ కమెడియన్ గా తెలుగు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కమెడియన్ గా మాత్రమే కాకుండా యాంకర్ గా అలీ తన ప్రతిభ ను చాటుకున్నాడు.

వెంకటేష్ :  విక్టరీ వెంకటేష్ 1971లో ప్రేమ్ నగర్ చిత్రంలో చిన్నప్పటి ఏఎన్‌ఆర్ పాత్రను పోషించారు. ఆ తర్వాత బాలనటుడిగా ఆయన ఏ సినిమాల్లోనూ నటించలేదు. ఆ తర్వాత 1986లో విడుదలైన కలియుగ పాండవులు చిత్రంతో హీరోగా మారారు వెంకటేష్. ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోలైన స్టార్ హీరోలలో ఒకరిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు.

అల్లు అర్జున్ :  అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా రెండు చిత్రాలలో నటించాడు. తన మామ, మెగాస్టార్ చిరంజీవితో కలిసి డాడీ సినిమాలో నటించాడు, అలాగే   5 సంవత్సరాల వయసులో విజయ్ అనే చిత్రంలో చిన్న పాత్ర చేశాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టైల్ కి ఐకాన్ గా స్టైలిష్ స్టార్ గా కొనసాగుతున్నాడు ఈ ఏడాది ఆలా అవైకుంఠపురంలో సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు.

మంచు మనోజ్ కుమార్ :  మేజర్ చంద్రకాంత్  చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్‌టిఆర్‌ తో స్క్రీన్ పంచుకున్న గొప్ప గౌరవం మంచు మనోజ్‌కు లభించింది. ప్రస్తుత తరం హీరోలలో ఎన్టీఆర్ తో కలిసి నటించిన ఏకైక హీరో మంచు మనోజ్ ఒక్కడే అని చెప్పాలి.  

 కళ్యాణ్ రామ్ :  1989లో విడుదలైన బాల గోపాలుడు చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా కళ్యాణ్ రామ్ నటించారు. ఆ తర్వాత ఏ సినిమాలోనూ ఆయన బాలనటుడిగా నటించలేదు. 2003లో విడుదలైన తొలి చూపులోనే చిత్రంతో హీరోగా మారారు కళ్యాణ్ రామ్. ఆ తరువాత రొటీన్ కి భిన్నంగా  విభిన్నమైన సినిమాలల్లో నటిస్తూ అభిమానులని అలరిస్తున్నారు.

ఆకాష్ పూరి :  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలి చిత్రం చిరుత చిత్రం ద్వారానే ఆకాష్ పూరి కూడా పరిచయమయ్యాడు. ఆ తరువాత బుజ్జిగాడు, గబ్బర్ సింగ్ వంటి చిత్రాల్లో నటించిన ఆకాష్.. ఆంధ్ర పోరి చిత్రంతో హీరోగా మారాడు. ప్రస్తుతం రొమాంటిక్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కొడుకే ఈ ఆకాష్ పూరి. కొడుక్కి ఓ మంచి హిట్ ఇవ్వాలని పూరి తెగ ట్రై చేస్తున్నాడు. 

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు