ఐపీఎల్ చరిత్రలో అరుదైన 6 రికార్డ్స్ !

inner-page-banner


ప్రపంచ క్రికెట్ చరిత్రనే మార్చేసిన అతి పెద్ద మెగా ఈవెంట్ ఐపిఎల్..ఇండియన్ ప్రీమియర్ లీగ్. 2008లో ప్రారంభమైన ఈ మెగా లీగ్ కి .. క్రికెట్ ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టడంతో ప్రతి ఏడాది దిగ్విజయంగా దూసుకుపోతుంది. రోజురోజుకి ఈ మెగా టోర్నీ పై అంచనాలు పెరిగిపోవడం.. అభిమానుల్ని ఆకర్షించేందుకు ఆటగాళ్లు సైతం తమ శక్తి వంచన లేకుండా మైదానంలో పోరాటపటిమ ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఐపీఎల్ అంటేనే రికార్డ్స్. ఈ ధనాధన్ క్రికెట్ లో బ్యాటింగ్ ,బౌలింగ్.. కీపింగ్ తో పాటు పలు విభాగాల్లో అత్యుత్తమ రికార్డ్స్ నమోదయ్యాయి. ఇప్పటివరకు ఈ మెగా లీగ్ లో నమోదైన కొన్ని ఆసక్తికరమైన రికార్డ్స్ ని ఇప్పుడు ఈ వీడియో లో చూద్దాం..


నెంబర్ వన్.. ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ సెంచరీ

2013 ఏప్రిల్ 23వ తేదీన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు క్రిస్ గేల్ .. పూణే వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో విధ్వంసకర ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. కేవలం 30 బంతుల్లోనే 100 పరుగులు రాబట్టుకున్నాడు. సెంచరీ సాధించే క్రమంలో ఏడు డాట్ బాల్స్ మాత్రమే ఉండగా.. 11 సిక్సులు , ఎనిమిది ఫోర్లు మాత్రమే ఉన్నాయి. ఈ మ్యాచ్లో గేల్ మొత్తంగా 66 బంతుల్లో.. 17 సిక్స్ లు, 13 ఫోర్లతో 175 పరుగులు చేశారు. ఇదే ఇప్పటికీ ఐపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం.

నెంబర్ 2 : ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.. ఐపీఎల్ లీగ్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డ్ ఇండియన్ స్టార్ ప్లేయర్ కె.ఎల్.రాహుల్ పేరిట ఉంది. ఢిల్లీ డేర్ డెవిల్స్ తో ఆడిన మ్యాచ్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున కేఎల్ రాహుల్ వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి.. కొత్త చరిత్రకి నాంది పలికాడు. 6 ఫోర్లు 4 సిక్సర్లతో చెలరేగి ఆడి సరికొత్త రికార్డును నమోదు చేశాడు.

నెంబర్ 3 : ఐపీఎల్ లో అత్యధిక క్యాచ్ లు పట్టిన రికార్డు.. అధిక మ్యాచ్ లు ఆడిన రికార్డు.. ఐపీఎల్ లో ఈ రెండు రికార్డ్స్ కూడా స్టార్ ప్లేయర్ సురేష్ రైనా పేరిటే ఉన్నాయి. ఇప్పటికీ ఇదే రికార్డ్. ఐపీఎల్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు సురేష్ రైనా102 క్యాచ్లు పట్టుకున్నాడు. అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఎవరికీ సాధ్యం కాని విధంగా 192 మ్యాచ్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్ తరఫున ఆడుతున్నాడు.నెంబర్ 4 : ఐపీఎల్ లో అత్యధిక భాగస్వామ్యం.. ఐపీఎల్ లో rcb జట్టు కు చెందిన కోహ్లి, డివిలియర్స్ పేరిట అత్యధిక భాగస్వామ్యం రికార్డ్ ఉంది. ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి చేసిన 229 పరుగుల భాగస్వామ్యమే ఐపీఎల్ హిస్టరీ లో అత్యధిక భాగస్వామ్యం.

నెంబర్ 5 : ఐపీఎల్ లో అత్యధిక అర్థ శతకాల రికార్డు.. ఐపీఎల్ లో అత్యధిక అర్థ శతకాలు రికార్డు సన్ రైజర్స్  హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. వార్నర్ ఇప్పటివరకు ఐపీఎల్ లో 44 అర్ధ శతకాలు చేశాడు. కెప్టెన్ గా ముందుండి నడిపిస్తున్నాడు.నెంబర్ 6 :  ఐపీఎల్ లో అత్యధిక మ్యాచులకి కెప్టెన్ గా వ్యవహరించిన రికార్డు..

ఐపీఎల్ లో సారథిగా ఎక్కువ మ్యాచ్ లు ఆడిన ఆటగాడిగా మహేంద్రసింగ్ ధోని రికార్డ్స్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా కొనసాగుతున్న ధోని.. 174 మ్యాచుల్లో కెప్టెన్ గా వ్యవహరించాడు .

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube