ప్రణబ్ గురించి అతి తక్కువమందికి మాత్రమే తెలిసిన నిజాలు..

inner-page-banner


మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ 1935 డిసెంబర్ 11న పశ్చిమబెంగాల్‌లోని బీర్‌భూమి జిల్లా మిరాటి గ్రామంలో జన్మించారు. 2012 జూన్ 15న దేశ 13వ రాష్ట్రపతిగా పదివీ బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరించే ట్రబుల్ షూటర్‌గా గుర్తింపుపొందారు.


ప్రణబ్‌ గురించి అతి తక్కువమందికి తెలిసిన  కొన్ని నిజాలు ...  వివరాల్లోకి వెళ్తే ..

1.ప్రణబ్ ముఖర్జీ ఒకప్పుడు ప్రొఫెసర్‌గా పనిచేశారు. 1963లో ఆయన పశ్చిమబెంగాల్‌లోని సౌత్ 24 పరిగణాల జిల్లా విద్యానగర్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ అభ్యసించారు.

2. స్థానిక బెంగాలీ వార్తాపత్రిక డెషెర్ డాక్లో జర్నలిస్టుగా పనిచేశారు.

3. 1969లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ స్వయంగా ప్రణబ్‌ను రాజకీయాల్లోకి తీసుకువచ్చారు.

4.ఇందిరాగాంధీ హత్యానంతరం కాంగ్రెస్‌ను వీడి రాష్ట్రీయ సమాజ్ వాది పార్టీని సొంతంగా స్థాపించారు.

5.1984లో ప్రణబ్ ముఖర్జీని ప్రపంచంలోనే ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరోమనీ మ్యాగజైన్‌‌ పట్టంకట్టింది.

6. పార్లమెంటులో ఏడు బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన ఏకైక ఆర్థిక మంత్రి ఆయనే.

7. ఆర్థిక సరళీకరణకు ముందు, ఆ తర్వాత కాలంలో కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఘనత కూడా ప్రణబ్‌దే.

8. పర్యటనలు, ప్రయాణాలు అంటే ప్రణబ్‌కు చాలా ఇష్టం. దేశ, విదేశాల్లో ఆయన చూడని ప్రాంతాలు తక్కువనే చెప్పాలి.

ప్రచార వ్యూహకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి దేశ ప్రథమ పౌరుడి స్థాయికి ఎదిగిన అపరచాణక్యుడు.. రాజ్యాంగాన్ని, పార్లమెంటరీ నిబంధనలను ఔపోసన పట్టిన రాజకీయ దురంధరుడు.. ప్రపంచంలోనే ఐదుగురు అత్యుత్తమ ఆర్థిక మంత్రుల్లో ఒకరుగా కితాబు అందుకున్న మేధావి.. సంకీర్ణ రాజకీయ ఒత్తిళ్లను తట్టుకుంటూ, వివిధ పార్టీలు, వర్గాల మధ్య విభేదాలను పరిష్కరించిన సంక్షోభ పరిష్కర్త.. ఆర్థిక సంస్కరణలకు ముందు.. తర్వాత.. ఆర్థిక మంత్రిగా దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించిన భారత రత్న.. రాజకీయ కురువృద్ధుడు.. ప్రణబ్‌ ముఖర్జీ మృత్యువుతో 21 రోజులపాటు చేసిన పోరాటంలో అలసి సొలసి.. సోమవారం సాయంత్రం తిరిగిరాని లోకాలకి పయనమైయ్యాడు.  


You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube