కోతికి గిఫ్టు .. యూజర్ మాన్యువల్ ఫాలో అవుతూ గిఫ్ట్ ఓపెన్ ... వైరల్ వీడియో...

inner-page-bannerగిఫ్ట్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. ఎవరైనా గిఫ్ట్ ఇవ్వగానే ..అదేంటో తెలుసుకోవాలనే కుతూహలం చాలా ఉంటుంది. కుదిరితే వెంటనే ఓపెన్ చేసి అదేంటో చూసేస్తాం. మనం మనుషులం కాబట్టి, మనకు ఆలోచనా శక్తి ఉంటుంది కాబట్టి... మనకు ఏదైనా గిఫ్ట్ రాగానే... దాన్ని పద్ధతిగా ఓపెన్ చేస్తాం. మనలాగే ఓ కోతి కూడా తనకు ఇచ్చిన గిఫ్టును చక్కగా ఓపెన్ చేసింది. గిఫ్ట్‌ బాక్సులో ఏముందా అని ఆరాటపడుతూ చూసింది. అంతే కాదు ఇన్‌స్ట్రక్షన్స్ మాన్యువల్ కూడా పేజీలు తిరగేసి పరిశీలించింది. బాస్కెట్ బాల్ ప్లేయర్ రెక్స్ చాప్మాన్... ఈ వీడియో క్లిప్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. నీటిని చల్లగా ఉంచే... థెర్మోస్‌ ఫ్లాస్క్ మూతను కోతి మనుషుల లాగే ఓపెన్ చేసింది. అందులో ఏముందా అని తల పెట్టి చూసింది. ఇదంతా ఆ కోతికి ఎంతో సరదాగా అనిపించింది. ఫ్లాస్క్ మూత బిగించి  మళ్లీ తెరిచి రెండోసారి అందులో ఏముందా అని చూసింది. ఇప్పటికే ఈ వీడియోని 21 లక్షల మందికి పైగా చూశారు. జార్జికి కొత్త థెర్మో ఫ్లాస్క్ వచ్చింది. అది ఇన్‌స్ట్రక్షన్స్ చదివి ఫాలో అయ్యిందని క్యాప్షన్ పెట్టాడు రెక్స్. ఈ వీడియోని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటూ షేర్ చేస్తున్నారు. కొంత మంది మాత్రం ఈ వీడియోపై అభ్యంతరం చెప్పారు. కోతుల్ని ఇళ్లలో ఎలా పెంచుకుంటారని ప్రశ్నించారు.ఓ నెటిజన్ చాలా సీరియస్‌గా విమర్శలు చేశారు. కోతులు వన్యప్రాణులు. ఇళ్లలో పెంచుకునేవి కావు. అవి ఇళ్లకు సంబంధించినవి కావు. వాటికి చైన్లు వేయడం, డైపర్లు తొడగడం ఇవన్నీ కరెక్టు కాదు అని చెప్తున్నారు.

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube